Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ నయా సూపర్‌స్టార్- టీమిండియాకు కొత్త ఓపెనర్ దొరికినట్టే: సురేష్ రైనా

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్.. వరుస విజయాలకు బ్రేక్ పడింది. వరుసగా మూడింట్లో విజయం సాధించిన ధోనీ సేన దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ కళ్లెం వేసింది. ఏకంగా 32 పరుగులతో తేడా మట్టి కరిపించింది. సీఎస్‌కేపై సాధించిన ఈ గెలుపుతో రాజస్థాన్- పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఎనిమిది మ్యాచ్‌లల్లో అయిదు విజయాలతో టాప్ పొజీషన్‌లో నిలిచింది.

గురువారం రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 77 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్. జోస్ బట్లర్-27, కేప్టెన్ సంజు శాంసన్-17, షిమ్రాన్ హెట్మెయిర్-8 పరుగులు చేశారు.

 Yashasvi Jaiswal is a superstar of IPL, praisedSureshRaina

లోయర్ ఆర్డర్‌లో ధృవ్ జురెల్, దేవ్‌దత్ పడిక్కల్ మెరుపులు మెరిపించారు. 15 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, మూడు ఫోర్లతో ధృవ్ 34, 13 బంతుల్లో అయిదు ఫోర్లతో పడిక్కల్ 27 పరుగులు చేశారు. వారిద్దరి దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోరు 200 మార్క్‌ను దాటుకుంది. చెన్నై బౌలర్లు కలిసికట్టుగా విఫలం అయ్యారు. తుషార్ దేశ్‌పాండే-2, మహీష్ తీక్షణ-1, రవీంద్ర జడేజా-1 వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల దుమ్ము దులిపాడు. 43 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 77 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇది అతని మూడో హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన జైస్వాల్ 304 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్‌ను 38.00గా రికార్డు చేశాడు. 147.57తో అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కొనసాగుతోంది.

జైస్వాల్ బ్యాటింగ్ స్టైల్.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సురేష్ రైనాను కట్టి పడేసింది. అద్భుతమైన క్రికెటింగ్ షాట్లను ఆడుతున్నాడంటూ కితాబిచ్చాడు. చక్కటి ఫుట్ వర్క్‌తో భారీ షాట్లను ఆడగలుగుతున్నాడని పేర్కొన్నాడు. బ్యాట్‌ను శరీరానికి దగ్గరగా ఉంచుకుని ఆడటం అనేది జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్‌ అని చెప్పుకొచ్చాడు. చిన్న చిన్న లోపాలను సరి చేసుకోగలిగితే టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతాడని అన్నాడు.

కవర్ డ్రైవ్స్ కొట్టినప్పుడు శరీరాన్ని ఎక్కువగా కదల్చట్లేదని, దాని వల్ల శక్తిమొత్తాన్ని చేతుల్లోకి తెచ్చుకోవడానికి వీలువుతుందని సురేష్ రైనా వ్యాఖ్యానించాడు. మొదటి ఆరు ఓవర్లలో అవుట్ కాకుండా క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇస్తూనే.. బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడని, ఓ ఓపెనర్‌కు ఉండాల్సిన గొప్ప లక్షణం ఇదేనని అన్నాడు.

Story first published: Friday, April 28, 2023, 13:55 [IST]
Other articles published on Apr 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+