Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ చేతిలో బిగ్ ప్రాజెక్ట్..!!

హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ దూకుడు కొనసాగుతోంది. తొలుత రెండు మ్యాచ్‌లల్లో ఎదురైన ఘోర పరాజయాల నుంచి వేగంగా కోలుకున్న ఆ జట్టు- ప్రత్యర్థులకు సింహస్వప్నంలా తయారైంది. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ విక్టరీలను నమోదు చేసింది. జట్టును పట్టాలెక్కించడంలో కేప్టెన్‌గా రోహిత్ శర్మ కీలక పాత్రను పోషించాడు.

ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లను ఆడిన ముంబై- తొలి రెండింట్లో ఓడింది. చివరి మూడు మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించింది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది ముంబై ఇండియన్స్. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది.

Rohit Sharma join hands with Jio Cinema as Brand Ambassador

జోరు మీదున్న ముంబై ఇండియన్స్‌కు మరో గుడ్‌న్యూస్ అందింది. కేప్టెన్ రోహిత్ శర్మ- మరో బిగ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకే చెందిన రిలయన్స్ జియో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. ఇప్పటివరకు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, సూర్యకుమార్ యాదవ్- రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోన్నారు. అదే జాబితాలో తాజాగా రోహిత్ శర్మ కూడా చేరాడు.

డిజిటల్ స్ట్రీమింగ్ యాప్‌కు ఇక రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడని జియో సినిమా మేనేజ్‌మెంట్ తెలిపింది. ఇదివరకు అతను స్టార్ స్పోర్ట్స్‌తో అసోసియేట్ అయి ఉన్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి అధికారికంగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను పొందిన ప్లాట్‌ఫామ్ ఇది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జియో సినిమాతో చేతులు కలిపాడు రోహిత్ శర్మ.

ఇప్పటికే రోహిత్ శర్మపై కొన్ని ఫొటో షూట్స్, ప్రోమోలను చిత్రీకరించింది జియో సినిమా యాజమాన్యం. వాటిని త్వరలోనే ప్రసారం చేయనుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా టెలికాస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ పోటీపడుతున్నాయి. అదే స్థాయిలో వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకుంటోన్నాయి.

అదే సమయంలో తన బ్రాండ్ వ్యాల్యూను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా- రోహిత్ శర్మను అంబాసిడర్‌గా అపాయింట్ చేసుకుంది జియో సినిమా. ఈ విషయంలో జియో సినిమా ఒక అడుగు ముందుకు వేసినట్టే. ఇప్పటికే సచిన్ టెండుల్కర్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోనీలపై చిత్రీకరించిన ప్రొమోలను విడుదల చేసింది. త్వరలోనే రోహిత్ ప్రొమోలు రిలీజ్ కానున్నాయి.

Story first published: Friday, April 21, 2023, 13:29 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+