Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసిన ఆర్సీబీ స్టార్స్.. ఫొటోలు వైరల్!

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు కొంచెం గ్యాప్ దొరికింది. దీంతో వీళ్లంతా తమ ఫ్యామిలీలతో కలిసి డిన్నర్ చేశారు. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ తదితర స్టార్ ప్లేయర్లు, కుర్రాళ్లతో కలిసి చక్కగా ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే చెన్నై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా చూశారు. ఈ డిన్నర్‌కు సంబంధించిన ఫొటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో పంచుకుంది.

కోహ్లీ దంపతులతో కలిసి సిరాజ్ దిగిన ఫొటోలు, మిగతా కుర్రాళ్లు దిగిన ఫొటోలు అన్నింటినీ ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆర్సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 8 మ్యాచులు ఆడింది. వీటిలో నాలుగింట గెలిచిన ఈ టీం.. నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో 8 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

virat kohli mohammed siraj

ఈ టీం మరీ ఎక్కువగా కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మీదనే ఆధార పడుతోందని నిపుణులు అంటున్నారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించడం లేదు. దీంతో వీరిపై మరీ ఎక్కువగా భారం పడుతోంది. ఈ సీజన్‌లో డుప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ ముగ్గురూ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ ఈ 8 మ్యాచుల్లో కలిపి 422 పరుగులు చేశాడు.

అతని ఓపెనింగ్ పార్టనర్ విరాట్ కోహ్లీ కూడా సూపర్‌గా ఆడుతున్నాడు. అతను కూడా ఈ 8 మ్యాచుల్లో 333 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ఆడిన చివరి మూడు మ్యాచుల్లో ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ చేయలేదు. పక్కటెముకలకు గాయం కావడంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అయినా అదిరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు.

అతని గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్సీ చేసిన కోహ్లీ.. వరుసగార రెండు మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. అయితే కేకేఆర్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఈ జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. కేకేఆర్ నిలిపిన 200+ పరుగుల స్కోరును ఛేజ్ చేయలేకపోయింది. దినేష్ కార్తీక్, సూయష్ ప్రభుదేశాయి తదితర బ్యాటర్లు ఫెయిలవడంతో గెలవలేకపోయింది.

Story first published: Friday, April 28, 2023, 17:37 [IST]
Other articles published on Apr 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+