Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Playoffs scenario: ఆ రెండు జట్లు అవుట్?

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌ సెకెండ్ హాఫ్.. హోరాహోరీగా సాగుతోంది. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న కొద్దీ అన్ని జట్లు తెగించి ఆడుతున్నాయి. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాయి. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ చెలరేగిన తీరే దీనికి నిదర్శనం. 149 పరుగుల లక్ష్యాన్ని పింక్ టీమ్.. 13.1 ఓవర్లల్లోనే ఊదిపడేసిందంటే ప్రత్యర్థిపై ఆ జట్టు ఎంతగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు.

కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటర్లు.. తమ హోమ్ పిచ్‌పై తడబడ్డారు. రాజస్థాన్ రాయల్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో ఘోరంగా విఫలం అయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 57 పరుగులు చేశాడు. మిగిలిన వారెవరూ సత్తా చాటలేకపోయారు.

Delhi Capitals and Kolkata Knight Riders is almost eliminated

అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 13.1 ఓవర్లలోనే 151 పరుగులు చేసింది. ఒక్క వికెట్ నష్టానికే లక్ష్యాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ మరోసారి దుమ్మురేపాడు. 62 బంతుల్లో అయిదు సిక్సర్లు, 12 ఫోర్లతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేప్టెన్ సంజు శాంసన్ 48 పరుగులతో అతనికి తనవంతు సహకారాన్ని అందించాడు.

ఈ ఓటమి తరువాత కోల్‌కత నైట్ రైడర్స్‌కు ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు అయిదు శాతానికి క్షీణించాయి. 95 శాతం మేర ఆ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయినట్టే. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లను ఆడిన ఈ టీమ్.. ఏడింట్లో ఓడింది. అయిదింట్లో గెలుపుతో 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్నప్పటికీ.. ముందుకు వెళ్లే అవకాశాలు లేవు.

ఇక చేతిలో ఉన్నవి రెండంటే రెండు మ్యాచ్‌లే. ఈ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌, 20వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడాల్సి ఉంది కేకేఆర్‌కు. ఈ రెండింట్లో ఏ ఒక్కటి ఓడిపోయినా.. ఇంటి దారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుస్తుందనే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ను భారీ తేడాతో నెగ్గి.. నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటే తప్ప ప్లేఆఫ్స్‌కు చేరలేకపోవచ్చు కోల్‌కత నైట్ రైడర్స్. ఢిల్లీ కేపిటల్స్ కూడా దాదాపుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లను ఆడిన ఢిల్లీ కేపిటల్స్ ఏడింట్లో ఓడింది. నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది.

ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందా జట్టు. పంజాబ్ కింగ్స్‌తో రెండు, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అన్నింట్లోనూ నెగ్గినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్టే. భారీ తేడాతో నెగ్గడం, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవడంపైనే ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్న జట్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉంది. ఈ జట్టుకు ఉన్న ఛాన్సులు 99.6 శాతం. 98 శాతంతో రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 61 శాతంతో ముంబై ఇండియన్స్ మూడో స్థానానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్-45 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్-43, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 22, పంజాబ్ కింగ్స్- 14, సన్‌రైజర్స్ హైదరాబాద్-13, కోల్‌కత నైట్ రైడర్స్- 5, ఢిల్లీ కేపిటల్స్-2 శాతాలతో ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Story first published: Friday, May 12, 2023, 8:38 [IST]
Other articles published on May 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+