Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాన్‌స్టర్ సిక్సర్: బంతిని స్టాండ్స్ దాటించిన కొత్త కుర్రాడు

మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌‌లో భాగంగా రెండో మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్.. తన హోమ్ పిచ్‌పై చెలరేగింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించడంలో కోల్‌కత తడబడుతోంది. ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ భానుక రాజపక్స హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. 32 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద మన్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేప్టెన్ శిఖర్ ధావన్-40 పరుగులతో రాణించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్-23, జితేష్ శర్మ- 21, సికందర్ రజా-16, సామ్ కర్రన్-26, షారుఖ్ ఖాన్-11 పరుగులు చేశారు.

IPL 2023, PBKS vs KKR: Rahmanullah Gurbaz smashed a six off the 2nd ball sent 101 metres

పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కోల్‌కత నైట్ రైడర్స్ తడబడుతోంది. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్ తొలి బంతికి మన్‌దీప్ సింగ్ బలి అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఓవర్ అది. అప్పటికి జట్టు స్కోరు 13 పరుగులే. అదే ఓవర్ చివరి బంతికి అనుకూల్ రాయ్ కూడా వెనుదిరిగాడు. నాలుగు పరుగులే చేసిన అనుకూల్ రాయ్.. సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.

తొలి మ్యాచే అయినప్పటికీ- ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన డెబ్యుటెంట్ రహ్మనుల్లా గుర్బాజ్ ఆకట్టుకున్నాడు. తక్కువ పరుగులే చేసినప్పటికీ స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. క్రీజ్ లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని భారీ సిక్స్ గా మలిచాడు. స్టాండ్స్ దాటించాడు. దీని డిస్టెన్స్ 101 మీటర్లు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన వాటిల్లో ఇదే భారీ సిక్సర్. సామ్ కుర్రన్ వేసిన ఆ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీశాడు గుర్బాజ్.

ఐపీఎల్ లో అతను ఎదుర్కొన్న తొలి బంతి అదే. నాలుగో బంతికి మన్‌దీప్ కూడా సింగిల్ తీయడంతో స్ట్రైక్ రొటేట్ అయింది. సామ్ కుర్రన్ వేసిన లెంగ్త్ డెలివరీని 101 మీటర్ల దూరానికి పంపించాడు. ఆ తరువాత కూడా అతని దూకుడు కొనసాగింది. ఆరో బంతికి ఫోర్ కొట్టాడు. 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు గుర్బాజ్. అయిదో ఓవర్ రెండో బంతికి అవుట్ అయ్యాడు. ఎల్లిస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Story first published: Saturday, April 1, 2023, 18:34 [IST]
Other articles published on Apr 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+