Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ గెలిచిన ఆనందం కూడా హార్దిక్ పాండ్యాకు లేకుండా పోయిందిగా..!!

చండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో హైఓల్టేజ్ మ్యాచ్‌లు కంటిన్యూ అవుతోన్నాయి. గురువారం రాత్రి మొహాలీలో పంజాబ్ కింగ్స్‌- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలాంటిదే. చివరి బంతి వరకూ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టిన మ్యాచ్ ఇది. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ రాహుల్ తెవాతియా- ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 36 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ ఒక్కడే టాప్ స్కోరర్. 24 బంతుల్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో ఈ స్కోర్ చేశాడు. భానుక రాజపక్స-20, జితేష్ శర్మ-25, సామ్ కుర్రన్- 22, షారుక్ ఖాన్-22, ప్రభ్‌సిమ్రాన్ సింగ్-0, కేప్టెన్ శిఖర్ ధావన్8, రిషి ధావన్-1 పరుగులు చేశారు.

Hardik Pandya has been fined Rs 12 Lakhs

పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. చివరి ఓవర్ వరకూ చెమటోడ్చాల్సి వచ్చింది. చివరి ఓవర్ అయిదో బంతికి గెలుపు రుచి చూసింది. 19.5 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. టైటాన్స్ ఇన్నింగ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ టాప్ స్కోరర్. ఈ సీజన్‌లో మరో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 49 బంతుల్లో ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 67 పరుగులు చేశాడు.

వృద్ధిమాన్ సాహా-30, సాయి సుదర్శన్-19, కేప్టెన్ హార్దిక్ పాండ్యా-8 పరుగులు చేశారు. డేవిడ్ మిల్లర్- 17, రాహుల్ తెవాతియా-5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అర్ష్‌దీప్ సింగ్, కగిసొ రబడ, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కుర్రన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ వికెట్‌తో రబడ ఐపీఎల్‌లో వంద వికెట్లను తీసుకున్న బౌలర్ల జాబితాలో చేరాడు.

కాగా గుజరాత్ టైటాన్స్ కేప్టెన్ హార్దిక్ పాండ్యాపై భారీ జరిమానా పడింది. అతనికి దక్కే మ్యాచ్ ఫీజులో 12 లక్షల రూపాయల మేర కోత పడింది. పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో స్లో- ఓవర్ రేట్‌ను నమోదు చేసినందుకు ఈ ఫైన్ కట్టాల్సి వచ్చిందతనికి. స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం- కోడ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్టవుతుంది. రెండోసారి కూడా హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్‌ను మెయింటెయిన్ చేస్తే జరిమానా మొత్తం రెట్టింపవుతుంది. 24 లక్షల రూపాయలకు పెరుగుతుంది.

దీనితో పాటు మిగిలిన 10 మంది ప్లేయర్లకు కూడా మ్యాచ్ ఫీజులో ఆరు లక్షల రూపాయలు లేదా 24 శాతం జరిమానా పడుతుంది. మూడోసారి అదే ఉల్లంఘన జరిగితే- బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. జట్టులోని ఇతర 10 మంది ఆటగాళ్లకు కూడా 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తారు.

Story first published: Friday, April 14, 2023, 13:44 [IST]
Other articles published on Apr 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+