Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ఆపరేషన్ తర్వాత ఇంటికి బయలు దేరిన ధోనీ.. వచ్చే ఐపీఎల్‌ గురించే ఆలోచన!

కొన్ని రోజుల క్రితమే ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడిన టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ.. ఇంటికి బయలు దేరాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ధోనీ సేన ఐదో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం వెలుగు చూసిన ఒక విషయం చాలా మందికి షాకిచ్చింది.

ఐపీఎల్ జరిగే సమయంలోనే ధోనీ మోకాలికి గాయంతో కనిపించాడు. తొలి మ్యాచ్‌కు ముందు కూడా నీ క్యాప్ పెట్టుకొని కనిపించాడు. అప్పుడప్పుడూ కుంటుకుంటూ నడుస్తూ నిలబడేందుకు ఇబ్బంది పట్టాడు. ఈ క్రమంలోనే సీఎస్కే యాజమాన్యం కూడా ధోనీ గాయం గురించి ప్రకటన విడుదల చేసింది.

IPL 2023 Mohammed Kaif meets MS Dhoni after his surgery

ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో పలు చెకప్‌లు చేయించుకున్న ధోనీ.. చివరకు మోకాలి శస్త్రచికిత్సకు ఒప్పుకున్నాడు. ఆపరేషన్ ముగిసిన తర్వాత తిరిగి స్వరాష్ట్రం జార్ఖండ్ వెళ్దామని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని టీమిండియా మాజీ దిగ్గజం మహమ్మద్ కైఫ్ కలిశాడు. కుటుంబంతో సహా వెళ్లి ధోనీని కలిసి ఫొటోలు దిగాడు.

'గొప్ప మనిషిని, అతని కుటుంబాన్ని మేం అందరం కలిశాం. సర్జరీ పూర్తయిన తర్వాత అతను తిరిగి ఇంటికి బయలుదేరాడు. చిన్నప్పుడు తను కూడా ఫుట్‌బాల్ ఆడే వాడినన ధోనీ చెప్పాడు. దీంతో మావాడు తెగ సంతోషిస్తున్నాడు. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా ' అంటూ దీనికి సంబంధించిన ఫొటోలను నెట్టింట పంచుకున్నాడు.

ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రపంచం నలుమూలల ఉన్న ధోనీ అభిమానులు వీటిపై స్పందించారు. ధోనీ విజయవంతంగా ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో అభిమానుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ధోనీ త్వరగా కోలుకోవాలని, మళ్లీ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అతన్ని చూసేందుకు రెడీ అవుతున్నామని చెప్పాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Story first published: Tuesday, June 6, 2023, 9:50 [IST]
Other articles published on Jun 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+