Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Varma : తిలక్ వర్మ ఆటను తెగ మెచ్చుకున్న సెహ్వాగ్.. కీలక సలహాలు ఇచ్చిన లెజెండ్!

ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోరు చేసింది. గిల్ సెంచరీతో చెలరేగడంతో 233 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది.

లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ముంబై తడబడింది. అయితే తిలక్ వర్మ క్రీజులోకి వచ్చిన తర్వాత ముంబై ఫ్యాన్స్ ఆశలు పెరిగాయి. అతను కేవలం 14 బంతుల్లోనే 43 పరుగులతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వేసిన ఓవర్లో ఏకంగా 24 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముంబై ఇన్నింగ్స్‌లో అతని బ్యాటింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

 Tilak Varma :

వీరిలో టీమిండియా మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మకు సెహ్వాగ్ కీలకమైన సూచనలు చేశాడు. అతను తన ఫిట్‌నెస్‌పై కొంత ఫోకస్ పెడితే మంచిదని సలహా ఇచ్చాడు. రెగ్యులర్‌గా క్రికెట్ ఆడితే ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం ఉండదన్న సెహ్వాగ్.. తిలక్‌కు ఆ ఛాన్స్ లేనందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నాడు.

'తిలక్ రెండు విషయాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి అతని ఫిట్‌నెస్. రెండోది తనకు పనికొచ్చే స్కిల్స్. వీటితోపాటు మైండ్‌సెట్‌పై కూడా దృష్టి పెడితే మంచిది. రెగ్యులర్‌గా క్రికెట్ ఆడుతూ ఉంటే.. కాలంతోపాటు మనం కూడా మారుతూ ఉంటాం. కానీ అలా ఆడటం కుదరనప్పుడు ఫిట్‌నెస్, స్కిల్స్‌పై బాగా ఫోకస్ పెట్టాలి' అని సెహ్వాగ్ సూచించాడు.

ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఫాలో అవ్వాలని తిలక్‌కు చెప్పాడు. ఇప్పుడు ఆడుతున్న స్పెషల్ షాట్లు ఆడటానికి సూర్య చాలా ప్రాక్టీస్ చేశాడని గుర్తుచేశాడు. 'తిలక్ తన బలహీనత ఏంటో గుర్తించి దాన్ని మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నించాలి. తిలక్‌ను చూస్తే 1999లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉంది' అని కొనియాడాడు.

 Tilak Varma

'నేను అరంగేట్రం చేసినప్పుడు షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో అవుటయ్యా. అప్పుడు గంగూలీ నన్ను ఎంకరేజ్ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేయాలని చెప్పాడు. అప్పుడైతే ఇంకా మెరుగ్గా ఆడగలనని చెప్పాడు. దాంతోనే నా ఆటతీరు మెరుగైంది' అని గుర్తుచేశాడు. 'నేను మిడిలార్డర్‌లో ఆడే వాడిని దాంతో స్పిన్‌ను బాగా ఎదుర్కొనే వాడిని. చివర్లో ఫాస్ట్ బౌలర్లు వచ్చే సరికి సెంచరీ అయిపోయేది. ఇప్పుడు తిలక్ కూడా తన బలహీనతలు ఏంటో గుర్తించి మెరుగవ్వాలి' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, May 27, 2023, 20:14 [IST]
Other articles published on May 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+