Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ రీప్లేస్ లిస్ట్‌లో మరో ప్లేయర్: ఆ ట్రెండ్ కంటిన్యూ

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో రీప్లేస్‌కు అడ్డుకట్ట పడట్లేదు. ఎవరో ఒకరు గాయపడటం.. ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం కంటిన్యూ అవుతోంది. ఈ సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తోంది. గాయాలతో పాటు వేర్వేరు కారణాలతో మొత్తంగా ఇప్పటివరకు ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరమైన ప్లేయర్ల జాబితా పెరుగుతోంది.

మొన్నటికి మొన్నే బంగ్లాదేశ్ ప్లేయర్ లిట్టన్ దాస్ స్థానాన్ని రీప్లేస్ చేసింది కోల్‌కత నైట్‌రైడర్స్ మేనేజ్‌మెంట్. ఫ్యామిలీ ఎమర్జెన్సీతో స్వదేశానికి వెళ్లిపోయిన అతని స్థానాన్ని వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జాన్సన్ ఛార్లెస్‌తో భర్తీ చేసింది. 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో అతణ్ని జట్టులోకి తీసుకుంది. టీ20 స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్.. జాన్సన్ ఛార్లెస్. ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున 41 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 971 పరుగులు చేశాడు.

IPL 2023: Lucknow Super Giants named Karun Nair for replace injured KL Rahul

2012, 2016ల్లో టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. వేర్వేరుగా 224 టీ20 మ్యాచ్‌లను ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈ ఫార్మట్‌లో మొత్తంగా 5,600 పరుగులు చేశాడు. ఛార్లెస్ జాన్సన్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ సీజన్ కోసం జరిగిన మెగా ఆక్షన్‌లో అతను పోటీ పడినప్పటికీ ఏ ఫ్రాంఛైజీ కూడా అతణ్ని తీసుకోలేదు. ఇప్పుడు అదే మొత్తానికి ఛార్లస్‌ను కోల్‌కత నైట్‌రైడర్స్ మేనేజ్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

ఇప్పుడు తాజాగా ఈ రీప్లేసుల లిస్ట్‌లో మరో ప్లేయర్ జాయిన్ అయ్యాడు. కరుణ్ నాయర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడబోతోన్నాడు. గాయపడ్డ కేప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్. 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో అతనితో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. లక్నో జెయింట్స్ ఆడే తదుపరి మ్యాచ్‌కు అతను జట్టుకు అందుబాటులోకి రానున్నాడు.

ఆదివారమే తన తదుపరి మ్యాచ్‌ను ఆడబోతోంది లక్నో. గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. మధ్యాహ్నం 3:30 గంటలకు గేమ్ మొదలవుతుంది. కరుణ్ నాయర్ ఐపీఎల్ ట్రాక్ రికార్డ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇప్పటివరకు 76 మ్యాచ్‌లల్లో 1,171 పరుగులు చేశాడు. 127.75 అతని స్ట్రైక్ రేట్.

10 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 83 నాటౌట్. ఈ ఐపీఎల్ సీజన్ కోసం నిర్వహించిన మెగా ఆక్షన్‌లో కరుణ్‌ నాయర్‌ను ఏ ఫ్రాంఛైజీ కూడా తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. ఇప్పుడు అనుకోకుండా అతనికి అవకాశం లభించింది. జట్టులో కేఎల్ రాహుల్ లేని లోటును కరుణ్ నాయర్ ఎలా భర్తీ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

Story first published: Saturday, May 6, 2023, 8:13 [IST]
Other articles published on May 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+