Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లేఆఫ్స్ సమీపించిన వేళ- స్టార్ బౌలర్ అవుట్: టైటిల్ హాట్ ఫేవరెట్‌కు ఎదురుదెబ్బ

లక్నో: ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్‌ను ఢిల్లీ కేపిటల్స్ చెక్ పెట్టింది. మంగళవారం రాత్రి తన హోమ్‌ పిచ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో మట్టికరిచింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది గుజరాత్.

ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్- లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 5లో కొనసాగుతున్నాయి ఈ రెండు జట్లు. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న వేళ- తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడనున్నాయి. ఫలితంగా స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కంటే మెరుగ్గా ఉంది లక్నో సూపర్ జెయింట్స్. ఈ రెండు జట్లూ అయిదేసి చొప్పున విజయాలను అందుకున్నప్పటికీ.. నెట్ రన్‌రేట్‌లో లక్నో ముందంజలో ఉంది.

 Lucknow Super Giants

చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌ను ఆడాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ వైదొలిగాడు. ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. నెట్స్‌ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో అతను గాయపడ్డాడు. ఉనద్కత్ ఎడమ భుజానికి గాయమైంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండట్లేదు.

జయదేవ్ ఉనద్కత్ తప్పుకొన్న విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ అధికారికంగా వెల్లడించింది. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో అతను కిందపడ్డాడు. ఎడమ పాదం నెట్‌ తాడులో చిక్కుకోవడంతో బ్యాలెన్స్ తప్పాడు. అతని ఎడమ భుజం నేరుగా భూమిని తాకింది. నొప్పితో విలవిల్లాడాడు. ఐస్ ప్యాక్‌తో కొద్దిసేపు సేదతీరినప్పటికీ.. అతని ఎడమభుజం, మోచేయిపై వాపు కనిపించింది.

దీని తరువాత అతను లక్నో నుంచి ముంబైకి బయలుదేరి వెళ్లాడు. బీసీసీఐ స్పెషలిస్ట్ కన్సల్టెంట్‌ను వద్ద స్కానింగ్ తీయించుకున్నాడు. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ చేతికి అందాయి. దీన్ని పరిశీలించిన తరువాత ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌కు ఉనద్కత్ అందుబాటులో ఉండట్లేదని ప్రకటించింది.

 Lucknow Super Giants

కాగా జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ నాటికి కోలుకుంటాడని బీసీసీఐ చెబుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే టెస్ట్ జట్టు కోసం ఉనద్కత్‌ కూడా ఎంపికైన విషయం తెలిసిందే. లండన్‌కు బయలుదేరి వెళ్లడానికి ముందే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటాడని బీసీసీఐ తెలిపింది.

Story first published: Wednesday, May 3, 2023, 11:28 [IST]
Other articles published on May 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+