Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

10 రోజులుగా ఐసీయూలో నాన్న- ఏడ్చేసిన ఐపీఎల్ స్టార్ బౌలర్

లక్నో: ఐపీఎల్‌ 2023 ప్లేఆఫ్స్ ముంగింట్లో ముంబై ఇండియన్స్ పరాజయాన్ని చవి చూసింది. తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక చివరి లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి తీరాల్సిన పరిస్థితిలో పడింది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే తప్ప ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరుకోలేకపోవచ్చు. ఈ ఓటమి- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత సులువు చేసింది.

మంగళవారం రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో మట్టికరిచింది ముంబై ఇండియన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో- నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ టార్గెట్‌ను అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయిదు పరుగుల తేడాతో ఓడింది.

 Mohsin Khanbreaksdown

లక్నో ఇన్నింగ్‌లో మార్కస్ స్టొయినిస్.. విధ్వంసక ఇన్నింగ్ ఆడాడు. హీరోగా నిలిచాడు. 47 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేప్టెన్ కృనాల్ పాండ్యా 49 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఇన్నింగ్ మొత్తం వారిద్దరిదే. స్టేడియంలో పరుగుల వరద పారించారు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు.

లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు చివరివరకు పోరాడినప్పటికీ.. గెలుపును అందుకోలేకపోయారు. ఇషాన్ కిషన్-59, రోహిత్ శర్మ-37, టిమ్ డేవిడ్- 32 పరుగులతో ప్రతిఘటించినప్పటికీ అది సరిపోలేదు. చివరికి అయిదు పరుగులతో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ధాటిగా ఆడలేకపోయారు.

ప్రత్యేకించి- మొహసిన్ ఖాన్ బౌలింగ్ ఆకట్టుకుంది. ముంబై ఇండియన్స్ గెలవడానికి చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్‌ను కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. హిట్టర్లు కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కూడా మొహసిన్ ఖాన్ మ్యాచ్ చేజారనివ్వలేదు. కట్టుదిట్టంగా బంతులు వేశాడు. చివరి ఓవర్‌లో అయిదు పరుగులే ఇవ్వగలిగాడు. ముంబై ఇండియన్స్‌కు విజయాన్ని దూరం చేశాడు.

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మొహసిన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నాడు. 10 రోజులుగా తన తండ్రి ఐసీయూలో ఉన్నాడని, అత్యవసర ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నాన్న కోసమే ఈ మ్యాచ్ ఆడానని, ఆయన దాన్ని చూసి ఉంటాడనుకుంటున్నానని చెప్పాడు. గాయాల వల్ల ఏడాదికాలంగా తాను కూడా క్రికెట్‌కు దూరంగా ఉన్నానని, గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని అన్నాడు. వాటన్నింటినీ అధిగమించేలా మ్యాచ్‌ను కాపాడుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు.

Story first published: Wednesday, May 17, 2023, 8:35 [IST]
Other articles published on May 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+