Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Once upon a time there lived a Ghost: దక్కన్ ఛార్జర్స్ లోగో వైరల్

కోల్‌కత: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో భాగంగా ఇవ్వాళ లక్నో సూపర్ జెయింట్స్- సన్‌‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. లక్నో జెయింట్స్‌కు ఇది మూడో మ్యాచ్ కాగా సన్‌రైజర్స్‌కు రెండోది. ఈ రెండు జట్లు కూడా ఇదివరకు మ్యాచ్‌లో ఓటమి చవి చూసినవే.

తాను ఆడిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది లక్నో. సన్‌రైజర్స్ కూడా తన తొలి మ్యాచ్‌లో ఓడింది. తనకంటే బలమైన రాజస్థాన్ రాయల్స్ చేతిలో మట్టికరిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్. గత సీజన్ తరహాలోనే ఇప్పుడు కూడా తన వైఫల్యాలను కొనసాగిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి అభిమానుల్లో.

Deccan Chargers logo viral

ఈ మ్యాచ్‌లో గెలిస్తే కాస్తయినా ఊపొస్తుంది అభిమానులకు. లేదంటే- ఈ నెగెటివ్‌నెస్ కంటిన్యూ అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. కోలుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు. ఇలాంటి పరిస్థితుల్లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఆ జట్టు హోమ్ పిచ్ మీద ఢీ కొట్టబోతోంది ఆరెంజ్ ఆర్మీ. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారనేది ఉత్కంఠతగా మారింది.

ఈ పరిణామాల మధ్య దక్కన్ ఛార్జర్స్ లోగో- సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. Once upon a time there lived a Ghost అనే క్యాప్షన్‌తో దీన్ని వైరల్ చేస్తోన్నారు అభిమానులు. కమల్ హాసన్ కమ్ బ్యాక్ మూవీ విక్రమ్ థీమ్ సాంగ్ ఇది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కన్ ఛార్జర్స్ నుంచి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉందని సజెస్ట్ చేస్తోన్నారు.


ఐపీఎల్ ఆరంభమైన రెండో సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది హైదరాబాద్‌కు చెందిన దక్కన్ ఛార్జర్స్. ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఆరు పరుగుల తేడాతో ఓడించింది. అప్పటి జట్టుకు ఆడమ్ గిల్‌‌క్రిస్ట్ కేప్టెన్. తొలుత బ్యాటింగ్ చేసిన దక్కన్ ఛార్జర్స్ 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోగలిగింది.

53 పరుగులు చేసిన ఓపెనర్ హెర్ష్‌లె గిబ్స్ టాప్ స్కోరర్. తిరుమలశెట్టి సుమన్-10, ఆండ్రూ సిమండ్స్-33, రోహిత్ శర్మ-24 పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టులో అనిల్ కుంబ్లే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీని దక్కన్ ఛార్జర్స్ బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. ప్రజ్ఞాన్ ఓఝా్-3, సిమండ్స్-2, హర్మీత్ సింగ్-2, ర్యాన్ హ్యారిస్-1, ఆర్పీ సింగ్-1 వికెట్ తీసుకున్నారు.

దక్కన్ ఛార్జర్స్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేయగలిగింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. వాండెర్‌మెర్వ్ 32 పరుగులు చేశాడు. అతనొక్కడే టాప్ స్కోరర్. రాస్ టేలర్-27, జాక్వెస్ కల్లిస్-15, రాబిన్ ఉతప్ప-17 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ భారీ స్కోర్ సాధించలేకపోయారు.

Story first published: Friday, April 7, 2023, 11:49 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+