Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 త్వరలోనే భారత్‌కు ఆడతాడు.. తెలుగు కుర్రాడిపై మాజీ లెజెండ్ నమ్మకం!

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న యువ ప్లేయర్ తిలక్ వర్మ. ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్.. ఆ టీం మిడిలార్డర్‌కు వెన్నెముకలా మారాడు. సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు ఫామ్‌లో లేకపోయినా.. ఆ టీంకు మంచి స్కోర్లు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలోనే అతను టీమిండియాకు ఆడతాడని జోస్యం చెప్పాడు. 'తిలక్ ఒక స్టాండౌట్ ప్లేయర్. కామెంటరీ చేసే సమయంలో కూడా చెప్పా.. అతను త్వరలోనే ఇండియాకు ఆడే ప్లేయర్ అని. ఎందుకంటే.. తిలక్ వద్ద చివర్లో మ్యాచ్ ఫినిష్ చేసే సత్తా మాత్రమే కాదు.. తను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు క్లారిటీతో ఆడే క్వాలిటీ ఉంది' అని రవిశాస్త్రి వివరించాడు.

ravishastri

తిలక్ వర్మ ఒక ఆల్‌రౌండ్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పుడు తను ఏం చేయాలనే క్లారిటీ అతనికి ఉంటుందని చెప్పాడు. 'అతను ఆడే తొలి పది బంతులు చూసిన ప్రతిసారీ నేను ఇంప్రెస్ అవుతూనే ఉంటా. ఛాన్స్ తీసుకోవడానికి అతను ఏమాత్రం వెనుకాడడు. అద్భుతమైన షాట్లు ఆడతాడు. తన బలాన్ని నమ్ముకొని రాణిస్తున్నాడు' అని తెలిపాడు. ఈ క్రమంలోనే తిలక్ కచ్చితంగా భారత్‌కు ఆడతాడని నమ్మకంగా చెప్పాడు.

అలాగే సన్‌రైజర్స్‌పై మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ కూడా తిలక్ వర్మను తెగ మెచ్చుకున్నాడు. బౌలర్లను చూసి ఒత్తిడికి గురి కాకుండా ఆడే ట్యాలెంట్ తిలక్‌కు ఉందని, అది చాలా గొప్ప క్వాలిటీ అని రోహిత్ అన్నాడు. ఇదే విషయాన్ని రవిశాస్త్రి కూడా ఒప్పుకున్నాడు. గతేడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన తిలక్.. తను సాధించిన ఘనతలు చూసి విశ్రాంతి తీసుకోకుండా, చాలా మెరుగయ్యాడని మెచ్చుకున్నాడు.

tilakvarma

'రోహిత్ చెప్పినట్లే.. తిలక్ బౌలర్లను ఎదుర్కోడు. బంతులను ఎదుర్కొంటాడు. అవతల బౌలింగ్ వేస్తోంది ఎంత గొప్ప బౌలర్ అయినా అతనికి పట్టదు. ఎందుకంటే అతను ఆ బౌలర్‌ను ఫేస్ చేయడు. అతను వేసే బంతిని ఫేస్ చేస్తాడు. అది అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది కూడా. దానికితోడు తిలక్ వద్ద చాలా షాట్లు ఉన్నాయి. దీంతో అతని టెంపర్‌మెంట్ కూడా సూపర్‌గా ఉంటుంది. గతేడాది అతను అద్భుతంగా ఆడాడు. ఈ ఏడాది అంతకుమించి అదరగొడుతున్నాడు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Story first published: Saturday, April 22, 2023, 16:57 [IST]
Other articles published on Apr 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+