For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Suyash Sharma: ఎవరీ యంగెస్ట్ మిస్టరీ స్పిన్నర్: ఆర్సీబీ నడ్డి విరిచాడు

కోల్‌కత: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ బోణీ చేసింది. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది కోల్‌కత నైట్‌రైడర్స్. భారీ తేడాతో నెగ్గడం వల్ల కేకేఆర్- తన నెట్ రన్‌రేట్‌ను ఒక్కసారిగా పెంచుకోగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత- నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. 17.04 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. హోరాహోరి పోరు తప్పదని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బెంగళూరులో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ ఇక్కడ మాత్రం దాన్ని కొనసాగించలేకపోయింది.

Suyash Sharma

205 పరుగుల భారీ లక్ష్యం ముందు పెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్.. దాన్ని ఛేదించడానికి ఏ మాత్రం ప్రయత్నించలేకపోయింది. ప్రారంభ ఓవర్లల్లో ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడినప్పటికీ- వికెట్లు పడుతున్న కొద్దీ తత్తరపాటును ప్రదర్శిస్తూ వచ్చింది. రిక్వైర్డ్ రన్‌ రేట్‌ను సాధించడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది ఆర్సీబీ బ్యాటర్లకు. ఫలితంగా మ్యాచ్ ఏకపక్షమైంది.

23 పరుగులు చేసిన కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ-21, మైఖేల్ బ్రేస్‌వెల్-19, డేవిడ్ విల్లీ-20, లోయర్ ఆర్డర్‌లో అక్ష్‌దీప్- 17 మాత్రమే వ్యక్తిగతంగా డబుల్ డిజిట్‌ను అందుకోగలిగారు. విరాట్ కోహ్లీ సహా ఆర్సీబీ బ్యాటర్లందరూ భారీ స్కోరును సాధించడంలో విఫలం అయ్యారు. మిగిలిన సగం మంది బ్యాటర్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు.

Suyash Sharma

ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్‌ మొత్తాన్నీ ధ్వంసం చేశారు కోల్‌కత నైట్ రైడర్స్ స్పిన్నర్లు. వరుణ్ చక్రవర్తి-4, సుయాష్ శర్మ-3, సునీల్ నరైన్- 2.. ఈ ముగ్గురే ఆ జట్టు పతనాన్ని శాసించారు. వరుణ్ చక్రవర్తి 3.4 ఓవర్లల్లో 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుయాష్ శర్మ నాలుగు ఓవర్లల్లో 30 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్ నాలుగు ఓవర్లల్లో 16 పరుగులకు 2 వికెట్లు కూల్చాడు.

ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకున్నదెవరైనా ఉన్నారంటే అతను సుయాష్ శర్మ. కేకేఆర్ స్పిన్ బౌలర్. అతని మిస్టరీ బౌలింగ్‌కు ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులు ఇచ్చి ఈ యంగెస్ట్ డెబ్యూ స్పిన్నర్.. మూడు వికెట్లు నేలకూల్చాడు. డేంజరస్ దినేష్ కార్తీక్, అనూజ్ రావత్, కర్ణ్ శర్మల వికెట్లను తీసుకున్నాడు.

సుయాష్ శర్మకు ఇదే తొలి ఐపీఎల్. వెంకటేష్ అయ్యర్‌కు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఈ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీకి చెందిన 19 సంవత్సరాల లెగ్ బ్రేక్ బౌలర్. ఢిల్లీ తరఫున అండర్-24లో స్టేట్ లెవెల్ మ్యాచ్‌లను మాత్రమే ఆడాడు. ఐపీఎల్ మినీ ఆక్షన్ సందర్భంగా అతణ్ని 20 లక్షల రూపాయలకే సొంతం చేసుకుంది కేకేఆర్.

విచిత్రం ఏమిటంటే- ఇప్పటివరకు అతను లిస్ట్ ఏ మ్యాచ్‌లు గానీ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు గానీ, టీ20 మ్యాచ్‌లు గానీ ఆడనే లేదు. అతను ఆడిన తొలి మ్యాచ్ ఇదే. బ్యాటర్లు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఏ మాత్రం బెరకు లేకుండా బౌలింగ్ చేశాడు. అతని బంతులను దినేష్ కార్తీక్ వంటి బౌలరే అర్థం చేసుకోలేకపోయాడంటే వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Story first published: Friday, April 7, 2023, 10:38 [IST]
Other articles published on Apr 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+