Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ డాషింగ్ బ్యాటర్ గాలి తీసిన సునీల్ గవాస్కర్

కోల్‌కత: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ హోమ్ పిచ్‌పై తన తొలి విజయాన్ని అందుకుంది. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగులతో ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. భారీ తేడాతో నెగ్గడం వల్ల కేకేఆర్- తన నెట్ రన్‌రేట్‌ను ఒక్కసారిగా పెంచుకోగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత- నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. 17.04 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలినప్పటికీ.. ముగ్గరు బ్యాటర్లు క్రీజ్‌లో పాతుకుపోయారు. భారీ ఇన్నింగ్ ఆడారు. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్- 57, మిడిలార్డర్‌లో రింకూ సింగ్- 46, లోయర్ ఆర్డర్‌లో బౌలర్ శార్దుల్ ఠాకూర్- 68 పరుగులతో విరుచుకుపడ్డారు.

sunilgavaskar

వెంకటేష్ అయ్యర్-3, మన్‌దీప్ సింగ్-0, ఆండ్రీ రస్సెల్-0 పరుగులు చేశారు. సునీల్ నరైన్-0, ఉమేష్ యాదవ్-6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కాగా- వీరందరిలో కంటే మన్‌దీప్ సింగ్‌పై విమర్శల దాడి ఆరంభమైంది. టీమిండియా మాజీ కేప్టెన్, లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఈ దాడికి తెర తీశారు. ఈ మ్యాచ్‌లో మన్‌దీప్ సింగ్‌ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

 sunil-gavaskar

తాను ఎదుర్కొన్న నాలుగో ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్‌లో ఫర్వాలేదనిపించే ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటివరకు 110 మ్యాచ్‌లను ఆడిన మన్‌దీప్ సింగ్ 1694 పరుగులు చేశాడు. ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి అతని ఖాతాలో. వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 77 పరుగులు. ఈ మ్యాచ్‌లో విల్లీ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో తడబడ్డాడు. తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దీనిపై సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. మన్‌దీప్ సింగ్ ప్రతీసారీ విఫలమౌతున్నప్పటికీ- ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక ఫ్రాంఛైజీలో చోటు దక్కించుకుంటోన్నాడంటూ వ్యాఖ్యానించాడు. జట్టులో భారీ ఇన్నింగ్‌ను నిర్మించడంలో విఫలమౌతోన్నాడని, ఓ యంగ్ ప్లేయర్‌కు ఇది ఏ మాత్రం శుభసూచకం కాదని పేర్కొన్నాడు. చిన్న చిన్న పరుగులను భారీ ఇన్నింగులుగా మార్చగలిగితేనే భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నాడు.

Story first published: Friday, April 7, 2023, 15:48 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+