కోల్‌కత: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ బోణీ చేసింది. తన హోమ్ పిచ్‌పై చెలరేగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏకంగా 81 పరుగులతో మట్టి కరిపించింది. తన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో డక్‌వర్త్ లూయిస్ మెథడ్‌లో ఓడిన కేకేఆర్.. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తరువాత బౌలింగ్ ఛాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది.
ముగ్గురే..: ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది కోల్‌కత నైట్ రైడర్స్. తొలత బ్యాటింగ్ చేసిన కేకేఆర్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలినా.. ముగ్గురే ముగ్గురు భారీ స్కోర్లు సాధించారు. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్- 57, మిడిలార్డర్‌లో రింకూ సింగ్- 46, లోయర్ ఆర్డర్‌లో బౌలర్ శార్దుల్ ఠాకూర్- 68 పరుగులతో విరుచుకుపడ్డారు.

శార్దుల్ చిరస్మరణీయ ఇన్నింగ్..: ప్రత్యేకించి శార్దుల్ ఠాకూర్ మరిచిపోలేని ఇన్నింగ్ ఆడాడు. 29 బంతుల్లోనే మూడు సిక్సర్లు, తొమ్మిది ఫోర్ల ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ చేతులెత్తేసింది. 23 పరుగులు చేసిన కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ-21, మైఖేల్ బ్రేస్‌వెల్-19, డేవిడ్ విల్లీ-20, అక్ష్‌దీప్- 17 మాత్రమే వ్యక్తిగతంగా డబుల్ డిజిట్‌ను అందుకోగలిగారు.
సగం మంది సింగిల్ డిజిట్..:మిగిలిన సగం మంది బ్యాటర్లు పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా 17.04 ఓవర్లలో 123 పరుగులకు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ చాప చుట్టేసింది. కేేకేఆర్‌లో బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. వరుణ్ చక్రవర్తి-4, సుయాష్ శర్మ-3, సునీల్ నరైన్- 2 వికెట్లు కూల్చారు. శార్దుల్ ఠాకూర్ ఖాతాలో ఒక వికెట్ పడింది.
స్పెషల్ అట్రాక్షన్..:ఈ మ్యాచ్ మొత్తానికీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు బాలీవుడ్ బాద్‌షా, కోల్‌కత నైట్ రైడర్స్ ఓనర్.. షారుఖ్ ఖాన్. తన కో ఫౌండర్ జుహీ చావ్లాతో కలిసి ఈడెన్ గార్డెన్స్‌లో సందడి చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచీ స్టేడియంలోనే ఉన్నారు వారిద్దరూ. వీఐపీ బాక్స్‌లో ఉండి మ్యాచ్ మొత్తాన్నీ చూశారు. శార్దుల్ ఠాకూర్ సునామీ ఇన్నింగ్‌ను ఎంజాయ్ చేశారు.
కోహ్లీతో స్టెప్స్..: తన సొంత జట్టు భారీ తేడాతో ప్రత్యర్థిపై గెలవడంతో షారుక్ ఖాన్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రౌండ్‌లో ప్రత్యక్షం అయ్యాడు. విరాట్ కోహ్లీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఝూమే జో పఠాన్ పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ ప్రారంభం అయ్యేంత వరకూ ఇద్దరూ కలిసే తిరిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో వైరల్ అయ్యాయి.