Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shardul Thakur: ఆ షాట్ ఎలా కొట్టాడో గానీ.. హీరో అయ్యాడు

కోల్‌కత: ఐపీఎల్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ వన్‌సైడ్ విక్టరీని అందుకుంది. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగులతో ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. మూడో స్థానానికి ఎగబాకింది. భారీ తేడాతో నెగ్గడం వల్ల కేకేఆర్- తన నెట్ రన్‌రేట్‌ను ఒక్కసారిగా పెంచుకోగలిగింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత- నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. 17.04 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. హోరాహోరి పోరు తప్పదని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బెంగళూరులో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయాన్ని సాధించిన ఆర్సీబీ ఇక్కడ మాత్రం దాన్ని కొనసాగించలేకపోయింది.

 Shardul Thakur

కోల్‌కత నైట్ రైడర్స్ జట్టు స్కోర్ 200 పరుగులను దాటడానికి ముగ్గురు బ్యాటర్లే ప్రధాన కారణం. ప్రత్యేకించి శార్దుల్ ఠాకూర్. ఫాస్ట్ బౌలర్‌గా మాత్రమే మనకు తెలిసిన శార్దుల్- ఈ మ్యాచ్‌లో నాణ్యమైన టీ20 క్రికెటింగ్ షాట్లను ఆడాడు. అతని బ్యాటింగ్ స్టైల్ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సీనియర్లు, మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోన్నారు. కొత్త లార్డ్గా అభివర్ణిస్తోన్నారు.

సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మీదుగా కొట్టిన శార్దుల్ కొట్టిన సిక్స్..ఎలా కొట్టాడో గానీ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 18వ ఓవర్ అయిదో బంతిని యార్కర్‌గా సంధించబోయాడు సిరాజ్. బంతిపై గ్రిప్ కోల్పోయాడు. వికెట్ల కంటే ఎత్తుకు దూసుకొచ్చిన ఆ బంతిని వికెట్ కీపర్ తల మీదుగా సిక్స్ కొట్టాడు. మిడిల్ ఆఫ్ ది బ్యాట్ అయిన ఆ డెలివరీ మెరుపు వేగంతో ఫెన్సింగ్ దాటింది.

సిరాజ్ వేసిన ఆ బాల్.. వికెట్ల మీదుగా వెళ్లడం వల్ల నో బాల్‌గా డిక్లేర్ చేశాడు అంపైర్. ఆ బంతికి మొత్తంగా ఏడు పరుగులొచ్చాయి. అది నో బాలా? కాదా? అనడానికి రివ్యూ కూడా తీసుకున్నారు. చివరి ఓవర్ నాలుగో బంతికి అదే సిరాజ్ బౌలింగ్‌లో శార్దుల్ అవుట్ అయ్యాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కోల్‌కత భారీ స్కోర్‌ను అందుకుంది.

రింకూ సింగ్‌తో కలిసి శార్దుల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్‌ను వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. లార్డ్ శార్దుల్, లార్డ్ రింకూ జబర్దస్త్ క్లీన్ హిట్టింగ్.. అంటూ ట్వీట్ చేశాడు వీరూ. దీనికి థ్యాంక్స్ చెబుతూ శార్దుల్ రిప్లై ఇచ్చాడు. ఆ షాట్లన్నీ కూడా మిమ్మల్ని చూసే నేర్చుకున్నానంటూ సమాధానం ఇచ్చాడు. క్లీన్ హిట్టింగ్‌ గురు వీరేంద్ర సెహ్వాగ్.. అంటూ ట్వీట్ చేశాడు. ఫాస్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొనడంలో సెహ్వాగ్ కంటే మొనగాడెవ్వడని, ఆయనను చూసి నేర్చుకున్నామని పేర్కొన్నాడు.

Story first published: Friday, April 7, 2023, 13:55 [IST]
Other articles published on Apr 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+