For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరికీ టీమిండియాలో చోటు- బీసీసీఐకి సీనియర్ల సూచనలు..!!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో యంగ్ క్రికెటర్ల హవా సాగుతోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, ధృవ్ జురెల్, ఆయుష్ బదోని, కర్ణ్ శర్మ, రాహుల్ తెవాతియా.. ఇలా యంగ్ ప్లేయర్లందరూ సత్తా చాటుతున్నారు. జాతీయ జట్టులో తలుపు తడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారంతా సద్వినియోగం చేసుకుంటోన్నారు.

ప్రత్యేకించి- రాజస్థాన్ రాయల్స్ డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోల్‌కత నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్.. తమ ప్రత్యేకతను చాటుకుంటోన్నారు. మ్యాచ్- మ్యాచ్‌కు వారు రాటుదేలుతున్నారు. విన్నర్లుగా నిలుస్తోన్నారు. ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తో్నారు. తాజాగా కోల్‌కత నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఏ స్థాయిలో చెలరేగాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు.

 bcci

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఆడిన జైస్వాల్.. 575 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 166.18 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌తో స్టేడియంలో పరుగుల వరదను పారిస్తోన్నాడీ లెఫ్ట్ హ్యాండర్. 2020లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన ఈ యంగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ అతి తక్కువ సమయంలో 1,000 పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. 36 మ్యాచ్‌లల్లో 1,122 పరుగులు చేశాడు.

రింకూ సింగ్ కూడా సత్తా చాటాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లను ఈ కోల్‌కత నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్.. 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 143.31. ఈ సీజన్‌లో వారిద్దరూ నిలకడగా రాణిస్తోండటం బోనస్. వికెట్ పడకుండా క్రీజ్‌లో శరవేగంగా పాతుకునిపోవడం, ఎలాంటి బౌలర్‌నయినా ధీటుగా ఎదుర్కొనడం వారి ప్రత్యేకత.

యశస్వి జైస్వాల్, రింకూ సింగ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలంటూ ఇదివరకే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో టీమిండియా మాజీ ప్లేయర్, స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా నడిచారు. యంగ్ ప్లేయర్లిద్దరినీ జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

 bcci

జైస్వాల్, రింకూ సింగ్‌ను నేరుగా తుదిజట్టులోకి తీసుకోవాలని తాను చెప్పట్లేదని, సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం వారికి కల్పించడం వల్ల రాటుదేలుతారని అన్నాడు. సత్తా చాటుతున్న ప్లేయర్లు బీసీసీఐలో భాగం కావాలని తాను కోరుకుంటోన్నానని, సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ పంచుకోవడం వల్ల వారు ఖచ్చితంగా కొత్త అంశాలను నేర్చుకుంటారని, తమ ఆటతీరును మరింత మెరుగుపర్చుకుంటారని అన్నాడు.

రింకూ సింగ్, యశస్వి జైస్వాల్‌కు జాతీయ జట్టులోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా కాంట్రాక్ట్ కుదుర్చుకునే ప్లేయర్ల సరసన వారిని చేర్చాల్సిన అవసరం ఉందని అన్నాడు. దీనివల్ల జైస్వాల్ రింకూ సింగ్ వంటి ప్రతిభావంతులకు జాతీయ జట్టులో భరోసా ఇచ్చినట్టవుతుందని అన్నారాయన.

Story first published: Wednesday, May 17, 2023, 14:28 [IST]
Other articles published on May 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+