Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అన్నదమ్ముల సవాల్: అన్ ప్లాన్డ్ మ్యాచ్..!!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా.. ఇవ్వాళ ఆసక్తికర పోరుకు తెర లేవనుంది. గుజరాత్ టైటాన్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ దీనికి వేదికయింది. సొంత అన్నదమ్ములు ఢీ కొట్టబోతోన్నారు. గెలుపు కోసం హోరాహోరీగా పోరాడబోతోన్నారు. తమ జట్లను గెలిపించడానికి బ్యాట్లను ఝుళిపించనున్నారు. వారిద్దరిలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఈ సాయంత్రానికి స్పష్టమౌతుంది.

లక్నో సూపర్ జెయింట్స్‌‌కు సారథ్యాన్ని వహిస్తోన్న కృనాల్ పాండ్యా.. ఇవ్వాళ తన తమ్ముడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోన్నాడు. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ పోరు- ఈ ఆదివారాన్ని సూపర్ సండేగా మార్చింది. ఈ పాండ్యా వర్సెస్ పాండ్యా మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తోంది.

IPL 2023, GT vs LSG: Gujarat Titans captain Hardik Pandya will face off his brotherKrunalPandya

నిజానికి- ఇది అన్ ప్లాన్డ్ మ్యాచ్. ఈ సీజన్‌లో ఇద్దరు అన్నదమ్ములు- గ్రౌండ్‌లో ప్రత్యర్థులుగా మారుతారనే అంచనాలు ఇంతకుముందు లేవు. లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ టైమ్ కేప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడటం వల్ల జట్టు సారధ్య బాధ్యతలను ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అందుకున్నాడు. కేప్టెన్‌గా అతనికి ఇది తొలి మ్యాచ్. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కృనాల్ పాండ్యానే కేప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ- అది వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దయింది.

ఇక తన తమ్ముడు నాయకత్వాన్ని వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్‌ను కృనాల్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తి రేపుతోంది. ఈ రెండు జట్లు కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హార్దిక్ పాండ్యా తన జట్టును పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. అతని నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లల్లో ఏడింట నెగ్గింది. 14 పాయింట్లతో టాప్ పొజీషన్‌లో ఉంది.

గత ఏడాది తరహాలోనే ఈ సీజన్‌లోనూ ఛాంపియన్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి గుజరాత్ మీద. దీనికి ధీటుగా ఉంది లక్నో సూపర్ జెయింట్స్ కూడా. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లను ఆడిన లక్నో అయిదింట్లో విజయాలను సాధించింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దయింది. మొత్తంగా 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్‌పై విజయాన్ని అందుకుంటే రెండో స్థానానికి ఎగబాకుతుంది.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టులో - వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్ బ్యాటర్), శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జరీ జోసెఫ్, నూర్ అహ్మద్ ఆడొచ్చు. బౌలర్ మోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకునే అవకాశం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టులో- కైలే మేయర్స్, క్వింటన్ డికాక్, కర్ణ్ శర్మ, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్ బ్యాటర్), ఆయుష్ బదోని , కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్/యశ్ ఠాకూర్ ఆడొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అమిత్ మిశ్రాను జట్టులోకి తీసుకుంటుంది.

Story first published: Sunday, May 7, 2023, 9:12 [IST]
Other articles published on May 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+