ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన థ్రిల్లింగ్ మ్యాచుల్లో గుజరాత్, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. చివరి ఓవర్లో 28 పరుగులు అవసరమైన దశలో కేకేఆర్ యంగ్ స్టార్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా ఐదు సిక్సర్లతో కోల్‌కతాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ చూసిన వాళ్లందరూ రింకూకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు.
ఈ జాబితాల వరల్డ్ సెలెబ్రిటీ, మాజీ పోర్న్ స్టార్ కెంద్రా లస్ట్ కూడా చేరింది. ఈ ఇన్నింగ్స్ చూసిన ఆమె రింకూను అభినందిస్తూ ట్వీట్ చేసింది. 'రింకూ ది కింగ్' అని పోస్టు పెట్టింది. దీంతోపాటు ముద్దు పెడుతున్నట్లు ఉన్న ఎమోజీని షేర్ చేసింది. దీంతోపాటు కేకేఆర్ లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో రింకూ ఉన్న ఫొటోలు.. తన ఫొటో కూడా చేర్చి తన ట్విట్టర్‌లో పంచుకుంది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. తన కుటుంబం కోసం ఆటో డ్రైవర్, స్వీపర్‌గా కూడా పనిచేశాడు. తొలిసారి ఐపీఎల్ వేలంలో 80 లక్షల రూపాయల కాంట్రాక్ట్ దక్కినప్పుడు చాలా సంతోషించాడు. అతని కుటుంబం కూడా అప్పుడు సంబరాలు చేసుకుంది. ఒకానొక సమయంలో కుటుంబ పోషణ కోసం గ్యాస్ సిలిండర్లు కూడా మోశాడీ ఎడం చేతి వాటం బ్యాటర్.
గతేడాది నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలకంగా మారాడు. గత సీజన్‌లో మెరుపు ఫీల్డింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన అతను.. చివర్లో ప్లేఆఫ్స్ చేరాలంటే కేకేఆర్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మెరిశాడు. ఆ జట్టును గెలిపించినంత పని చేశాడు. కానీ రావ్‌మెన్ పావెల్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో విజయం ఢిల్లీనే వరించింది. ఆ ఓటమి తర్వాత కన్నీళ్లతో కనిపించిన రింకూ.. ఈ ఏడాది మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు.