Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul : రాహుల్ జిడ్డు బ్యాటింగ్‌ కరెక్ట్ అంటున్న మాజీ లెజెండ్.. అనవసరంగా విమర్శిస్తున్నారట!

టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ నెమ్మదిగా ఆడటంపై కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో కూడా అతను టీమిండియాకు శుభారంభాలు అందించలేకపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా నెమ్మదైన బ్యాటింగ్‌తో విమర్శలపాలు అవుతున్నాడు. అయితే అతనిపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆసీస్ లెజెండ్ టామ్ మూడీ అంటున్నాడు.

తాజాగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రాహుల్ 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇది చూసిన చాలా మంది మండిపడ్డారు. టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ ఇంత జిడ్డు బ్యాటింగ్ చేస్తే ఎలా అని విమర్శలు చేశారు. అయితే అతను ఈ మ్యాచ్‌లో చక్కగా ఆడాడని ఆసీస్ మాజీ లెజెండ్, ప్రముఖ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. అనవరసంగా అతనిపై మరీ విమర్శలు ఎక్కువ చేస్తున్నారని అన్నాడు.

KL Rahul

'రాహుల్ ఈ మ్యాచ్‌లో బాగానే ఆడాడు. పరిస్థితులను అర్థం చేసుకొని, వాటికి తగినట్లు బ్యాటింగ్ చేశాడు. కొంతకాలంగా ఇలా నెమ్మదిగా ఆడుతున్నందుకు రాహుల్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ నా దృష్టిలో అతనిపై వస్తున్న ఈ విమర్శలు మరీ అతిగా ఉన్నాయి. ఒక కెప్టెన్‌గా చూసుకుంటే.. గెలవడానికి అవసరమైన బౌలింగ్ మార్పులతో ఆకట్టుకున్నాడు కూడా' అని రాహుల్‌ను మూడీ మెచ్చుకున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో రాహుల్ ఫర్వాలేదు అనిపిస్తున్నాడు. భారీ ఇన్నింగ్సులు లేకపోయినా.. వేగంగా ఆడకపోయినా.. నిదానంగా పరుగులు కూడబెట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు లక్నో ఆడిన ఆరు మ్యాచుల్లో అతను 194 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేటు మాత్రం 114 మాత్రమే ఉండటం గమనార్హం. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్, నిపుణులు అతని జిడ్డు బ్యాటింగ్‌పై విమర్శలు చేస్తున్నారు.

కానీ ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, అతను పరిస్థితులకు తగ్గట్లే ఆడుతున్నాడని టామ్ మూడీ అంటున్నాడు. రాహుల్ ఆటతీరుకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఇది చూసిన చాలా మంది విదేశీయులంతా ఇలాగే రాహుల్‌కు హైప్ తీసుకొచ్చి, టీమిండియా ఓడిపోవడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత వన్డే వరల్డ్ కప్‌లో విజయ్ శంకర్‌కు ఇలాగేే హైప్ తీసుకొచ్చి, అంబటి రాయుడును పక్కన పెట్టేలా చేశారు. దీని వల్ల జట్టు ఎంత నష్టపయిందో తెలిసిందే.

Story first published: Thursday, April 20, 2023, 18:06 [IST]
Other articles published on Apr 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+