Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అల్లుడు.. లెట్స్ డు కుమ్ముడు

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టబోతోన్నాయి. లోకల్ టీమ్ గుజరాత్ టైటాన్స్- వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం- ఈ మ్యాచ్‌కు వేదిక.

శుక్రవారం రాత్రి ఇదే స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. 62 పరుగుల తేడాతో రోహిత్ సేను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్- నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ దీన్ని అందుకోలేకపోయింది. 18.2 ఓవర్లల్లో 171 పరుగులకు ఆలౌట్ అయింది.

IPL 2023 Final: Twitter reacts as Shubman Gill chats with SachinTendulkar

వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పరుగుల వరదను పారించాడు. 86 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 129 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో మూడు సెంచరీలను తన పేరు మీద లిఖించుకున్నాడు. సాయి సుదర్శన్- 43, హార్దిక్ పాండ్యా- 28, వృద్ధిమాన్ సాహా- 18 పరుగులు చేశారు.

ఈ ఐపీఎల్ సీజన్- శుభ్‌మన్ గిల్‌దే. లీగ్ మ్యాచ్‌లల్లో రెండు సెంచరీలు అందుకున్నాడు. బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలు బాదడం అంటే మాటలు కాదు. ఇప్పుడు మళ్లీ రెండో క్వాలిఫయర్‌లోనూ అలవోకగా వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 16 మ్యాచ్‌లల్లో మూడు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు చేశాడు.

గిల్ అత్యధిక వ్యక్తిగత పరుగులు 129. బ్యాటింగ్ యావరేజ్ 60.79. స్ట్రైక్ రేట్ 156.43. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 851 పరుగులు చేశాడీ డాషింగ్ ఓపెనర్. ఇంకా ఓ మ్యాచ్ మిగిలేవుంది. 2018లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తరువాత ఇప్పటివరకు 90 మ్యాచ్‌లను ఆడాడు శుభ్‌మన్ గిల్. 2,751 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో గిల్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఆదివారం అతను ఆడబోయే ఫైనల్- మూడోది. వరుసగా మూడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ఆడిన ఘనత అతనికి దక్కింది. 2021లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌పై ఫైనల్ మ్యాచ్ ఆడాడు. అందులో 51 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ అతనే. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయింది. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ తరఫున ఫైనల్స్ ఆడాడు. 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మ్యాచ్ ముగిసిన తరువాత శుభ్‌మన్ గిల్- టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్‌ పక్కనే కూర్చుని మాట్లాడటం కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గిల్- సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ లవర్స్ కావడం వల్ల నెటిజన్స్ తమ క్రియేటివిటీకి పదునుపెట్టారు. మీమ్స్‌తో చెలరేగుతున్నారు. ఫైనల్స్ గెలవడంపై మామఅల్లుళ్లు మంతనాలు సాగిస్తోన్నారంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు.

Story first published: Saturday, May 27, 2023, 11:45 [IST]
Other articles published on May 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+