ఐపీఎల్‌కు భారత దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ భారీగానే ఉంది. అదే మన దేశంలో అయినా ఆ క్రేజ్ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఈ క్రేజ్ ఎంతలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో జట్టుకు ఫ్యాన్ బేస్ భారీగా ఉంటుంది మరి. ఈ క్రమంలోనే దాదాపు అన్ని రాష్ట్రాల్లో తమ జట్లకు సపోర్ట్ చేస్తూ భారీగా ప్రమోషన్స్ చేస్తుంటారు. అదే కోవలో సన్‌రైజర్స్ కూడా చేరింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సపోర్ట్‌గా హైదరాబాద్ మెట్రో రైలుపై సన్‌రైజర్స్ టీం యాడ్స్‌తో నింపేశారు. మెట్రో రైల్ మొత్తం ఆరెంజ్ కలర్ నింపేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్, సపోర్ట్ మామూలుగా లేదని సోషల్ మీడియా ఫ్యాన్స్ అంటున్నారు. సన్‌రైజర్స్ కూడా ఈ సీజన్‌ను మొదట రెండు ఓటములతో మొదలు పెట్టినా.. ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

ఇలా కేవలం సన్‌రైజర్స్ మాత్రమే కాదు. మెట్రో ఉన్న దాదాపు ప్రతి సిటీలో ఇలాంటి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీం కూడా ఇలాగే ప్రమోషన్స్ చేస్తోంది. లక్నో మెట్రోపై కూడా లక్నో ప్లేయర్స్, లోగో, కలర్స్ పెయింట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. లక్నో అభిమానులు కూడా తాము ఇది ముందే మొదలు పెట్టామని అంటున్నారు.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ గురించి చెప్పుకోకుండా ఉండలేం. అసలు మొదట మెట్రో రైలుకు ఇలా పెయింట్ వేసింది తామేనని గుజరాత్ ఫ్యాన్స్ అంటున్నారు. అహ్మదాబాద్ మెట్రో రైలుపై గుజరాత్ ప్లేయర్స్, లోగోల పెయింట్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోలను గుజరాత్ టైటాన్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు కూడా. ఇలాగే రాజస్థాన్ కూడా ఇలాంటి ప్రమోషన్స్ బాగా చేస్తోందని వాళ్ల ఫ్యాన్స్ అంటున్నారు.