Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023: ఈఏడాది ఐపీఎల్ విజేత ఎవరో తెలిసింది..లెక్క పక్కా..!

మరి కొన్ని గంటల్లో అతిపెద్ద క్రీడా వేడుక ప్రారంభం కానుంది.అహ్మదాబాద్ వేదికగా మార్చి 31వ తేదీన ఐపీఎల్ మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతుంది. అయితే ఇంకా ఒక మ్యాచ్ కూడా మొదలవలేదు అప్పుడే ఈ టోర్నీ విజేతలెవరో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తేల్చేశాడు.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఈసారి ఐపీఎల్ విజేత ఎవరో తేల్చేశారు. సాధారణంగా ఏదైనా విషయం పంచుకోవాలంటే వాన్ నిర్మొహమాటంగా ట్విటర్‌పై షేర్ చేసుకుంటాడు.అలాగే ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్‌ కోసం తాను ఎంతో ఆతురతతో చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో నాలుగుసార్లు టైటిల్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతుంది.

IPL 2023: England former captain Michael Vaughan predicts the tournament winner,Here is all

ఇక ట్విటర్‌పై మైఖేల్ వాన్ జ్యోస్యం చెప్పారు. 2023 ఐపీఎల్ విజేతగా సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ నిలుస్తుందంటూ జోస్యం చెప్పారు.ఐపీఎల్ తొలి సీజన్ 2008 విజేతగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. ఆ సమయంలో దివంగత ఆటగాడు షేన్ వార్న్ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.గత సీజన్‌లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్‌కు చేరింది. అయితే గుజరాత్‌ టైటాన్స్ పై ఓడి రన్నర్స్‌ అప్‌గా నిలిచింది.

ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన 14 మ్యాచుల్లో 9 మ్యాచ్‌లు గెలిచి నాలుగింటిలో ఓటమి చవిచూసింది. ఐపీఎల్ 2022 ఫైనల్స్‌లోకి ప్రవేశించేందుకు జరిగిన క్వాలిఫైయర్‌ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించింది. అయితే ఫైనల్స్‌లో మాత్రం సంజు శాంసన్ జట్టు నిరాశపర్చింది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టులో జేసన్ హోల్డర్, ఆడం జంపా, జో రూట్‌లాంటి మేటి ఆటగాళ్లున్నారు. సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.

Story first published: Thursday, March 30, 2023, 17:24 [IST]
Other articles published on Mar 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+