For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్లేఆఫ్స్‌లో రోహిత్ శర్మ ఆల్ టైమ్ రికార్డ్ ఇదీ- చెరిపేసుకుంటాడా..?!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- మరోసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి. 2021 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడబోతోంది. ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది.

మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్‌ 1లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది ధోనీ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకు కుప్పకూలింది. 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

 IPL 2023, Eliminator

ఫైనల్స్ చేరడానికి గుజరాత్ టైటాన్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్ 2లో నెగ్గాల్సి ఉంటుంది. ఇవ్వాళ ఎలిమినేటర్ మ్యాచ్‌. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ ఢీ కొట్టనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది గుజరాత్‌కు. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది.

ఈ ఎలిమినేటర్ రోహిత్ శర్మకు లైఫ్ అండ్ డెత్ గేమ్‌గా మారింది. వరుసగా రెండు సీజన్ల ప్లేఆఫ్స్‌కు దూరమైంది ముంబై ఇండియన్స్. 2021, 2022 సీజన్లల్లో లీగ్ దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కూడా చివరి నిమిషంలో తన బెర్త్‌ను కన్‌ఫర్మ్ చేసుకోగలిగింది. క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్లేఆఫ్స్‌లోకి చేరిన రోహిత్ సేన- ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది.

నిజానికి- ప్లేఆఫ్స్‌లల్లో రోహిత్ శర్మకు సూపర్ ట్రాక్ రికార్డ్ ఉంది. ప్లేఆఫ్స్‌ చేరిన ప్రతీసారీ విజయఢంకా మోగించాడు రోహిత్. ముంబై ఇండియన్స్ కేప్టెన్‌గా ఇప్పటివరకు అతను 13 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 10 మ్యాచ్‌లల్లో జట్టును విజయపథం వైపు నడిపించాడు. మూడింట్లో మాత్రమే ఓడింంది ముంబై ఇండియన్స్. ఇప్పుడు ఇదే ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్‌తో మరోసారి ప్లేఆఫ్స్ ఆడబోతోన్నాడు.

క్యాప్డ్ ప్లేయర్లల్లో అత్యధికసార్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను ఆడిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. ప్లేయర్‌గా, కేప్టెన్‌గా మొత్తం 19 మ్యాచ్‌లను ఆడాడు. ఇందులో 13 మ్యాచ్‌లల్లో అతను ప్రాతినిథ్యాన్ని వహించిన జట్టు గెలిచింది. ఆరింట్లో ఓడింది. ప్లేఆఫ్స్‌లల్లో 297 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అతని బ్యాటింగ్ యావరేజ్.. 16.50. 108.79 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 68 పరుగులు.

Story first published: Wednesday, May 24, 2023, 13:11 [IST]
Other articles published on May 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+