For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ సత్తాకు సిసలు పరీక్ష- ప్రయోగాలకు నో ఛాన్స్

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- మరోసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి. 2021 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడబోతోంది. ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది.

మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్‌ 1లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది ధోనీ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకు కుప్పకూలింది. 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

IPL 2023, Eliminator, LSG vs MI Dream 11: Match predictions, pitch and weather report here

ఫైనల్స్ చేరడానికి గుజరాత్ టైటాన్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్ 2లో నెగ్గాల్సి ఉంటుంది. ఇవ్వాళ ఎలిమినేటర్ మ్యాచ్‌. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ ఢీ కొట్టనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది గుజరాత్‌కు. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది.

ఈ ఎలిమినేటర్ రోహిత్ శర్మకు లైఫ్ అండ్ డెత్ గేమ్. వరుసగా రెండు సీజన్ల ప్లేఆఫ్స్‌కు దూరమైంది ముంబై ఇండియన్స్. 2021, 2022 సీజన్లల్లో లీగ్ దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కూడా చివరి నిమిషంలో తన బెర్త్‌ను కన్‌ఫర్మ్ చేసుకోగలిగింది. క్లిష్ట పరిస్థితులను అధిగమించి ప్లేఆఫ్స్‌లోకి చేరిన రోహిత్ సేన- ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది.

ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ ఎలాంటి ప్రయోగాలకూ పూనుకోకపోవచ్చు. చివరి లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టికరిపించిన జట్టుతోనే బరిలోకి దిగొచ్చు. బౌలింగ్‌లో విఫలమైనప్పటికీ- బ్యాటర్లు సత్తా చాటిన మ్యాచ్ అది. కామెరాన్ గ్రీన్ ఫుల్ ఫామ్‌లో ఉండటం ముంబై ఇండియన్స్‌కు బోనస్. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్.. బ్యాటింగ్‌లో సత్తా చాటుతుండటంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయకపోవచ్చు.

తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వాల్ ఆడొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్లుగా- రమణదీప్ సింగ్, విష్ణు వినోద్. ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్‌ను తీసుకునే అవకాశం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్) కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా (కేప్టెన్), అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్- హక్, మొహ్‌సిన్ ఖాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్లుగా- కైలే మేయర్స్, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్ చరక్‌ను ఆడించవచ్చు.

డ్రీమ్ టీమ్‌లో- వికెట్ కీపర్ బ్యాటర్లుగా క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఇషాన్ కిషన్, బ్యాటర్లుగా సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), టిమ్ డేవిడ్, ఆల్ రౌండర్లల్లో మార్కస్ స్టోయినిస్ (వైస్ కేప్టెన్), కృనాల్ పాండ్యా, కామెరాన్ గ్రీన్, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో పీయూష్ చావ్లా, రవి బిష్ణోయ్, ఆకాష్ మధ్వల్‌ను తీసుకోవచ్చు.

Story first published: Wednesday, May 24, 2023, 8:50 [IST]
Other articles published on May 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+