ఐపీఎల్ 2023 ఆరంభం నుంచి ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగించిన అంశాల్లో ధోనీ మోకాలి గాయం ఒకటి. గుజరాత్‌తో టోర్నీ ఓపెనర్‌లో మ్యాచ్‌కు ముందు కూడా ధోనీ కుంటుతూ కనిపించాడు. అయితే ఈ నొప్పి విషయం పెద్దగా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. అడపా దడపా నీ క్యాప్స్‌తో కనిపించాడే కానీ.. విషయం పెద్ద సీరియస్ కాదనేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
అయితే చెెపాక్‌లో చెన్నై లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ జరిగిన తర్వాత టీం అంతా లీప్ ఆఫ్ హానర్ తీసుకుంది. ఈ సమయంలో మైదానంలో నడిచేటప్పుడు కూడా ధోనీ మోకాలికి నీ క్యాప్ ఉంది. ఇది చూసిన అభిమానులు అతని మోకాలి నొప్పి మరీ తీవ్రంగా ఉందా? అని టెన్షన్ పడ్డారు. అయితే ఆ తర్వాత తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్‌ను చెన్నై ఓడించడంతో ఈ విషయం అంతా మర్చిపోయారు.

ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో కూడా చెన్నై అదరగొట్టింది. గుజరాత్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసి తమ ఖాతాలో ఐదో టైటిల్ వేసుకుంది. ఈ క్రమంలో ఎమోషనల్ అయిపోయిన ధోనీ.. విన్నింగ్ రన్స్ స్కోర్ చేసిన జడ్డూను గాల్లోకి ఎత్తుకొని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విజయం తర్వాత ధోనీ ఆరోగ్యంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ ట్రోఫీ నెగ్గగానే రిటైర్‌మెంట్ తీసుకోవడం మంచి ఆప్షన్ అని చెప్పిన ధోనీ.. కానీ అభిమానుల కోసం మరొక సీజన్ ఆడాలని ఉన్నట్లు చెప్పాడు. ఈ 8-9 నెలలు కష్టపడి మరొక ఐపీఎల్ సీజన్ ఆడతానని చెప్పాడు. ఈ క్రమంలోనే ముంబైలో ధోనీ మోకాలి గాయానికి సంబంధించి పలు టెస్టులు జరగనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ధోనీ మోకాలికి గాయమైనట్లు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆస్పత్రిలో ఈ వారం ధోనీకి టెస్టులు జరుగుతాయని సమాచారం. ఈ గాయం మరీ పెద్దది కాకపోతే చిన్న టెస్టులు, మెడిసిన్స్‌తో సరిపోతుంది. లేదంటే శస్త్రచికిత్స అవసరం కావొచ్చు. ఇప్పటికే 41 ఏళ్ల ధోనీ ఇంకా వికెట్ కీపింగ్ చేస్తూ వంగి నిలబడటం వల్లనే ఈ మోకాలి నొప్పి వచ్చి ఉండొచ్చని కొందరు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా ధోనీకి టెస్టులు జరిగితేనే అసలు విషయం బయటకు వస్తుంది.