Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : ‘ధోనీ.. ధోనీ..’ ఫ్యాన్స్ అరుపులు వింటే చాలా డేంజర్.. నిపుణుల వార్నింగ్!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఏరేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ ధోనీకి చివరిది అని ప్రచారం జరగడంతో.. ధోనీ ఆడిన మ్యాచులు చూసేందుకు చాలామంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ధోనీ ఆటను మళ్లీ ఎప్పుడు చూస్తామో తెలియదు అని వాళ్లంతా స్టేడియానికి దూసుకొచ్చారు.

అక్కడితో ఆగని ఫ్యాన్స్.. 'ఎంఎస్ డీ.. ఎంఎస్ డీ..' అంటూ తెగ నినాదాలు చేశారు. ఒకానొక సమయంలో ఈ గొడవ మధ్యలో యాంకర్లు అడిగే ప్రశ్న కూడా ధోనీకి వినిపించలేదు. దీంతో అతను వెళ్లి స్పీకర్ వాల్యూమ్ బాగా పెంచాల్సి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడకు సీఎస్కే ఫ్యాన్స్ కోకొల్లలుగా చేరిపోయారు.

MS Dhoni Chants in Stadium

ఈ క్రమంలోనే చెన్నైలో అయితే హోం టీంకు సపోర్ట్ అదిరే రేంజ్‌లో ఉంది. ఎంఎస్ ధోనీపై వారి అభిమానం మరో స్థాయికి చేరిపోయింది. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ ఆరంభం సమయంలో ఫ్యాన్స్ అందరూ 'ధోనీ.. ధోనీ..' అంటూ నినాదాలను చేశారు. వీటితో ఆ స్టేడియం అంతా హోరెత్తింది. వీటిన విన్న ధోనీకి టాస్ సమయంలో అడిగే ప్రశ్నలు కూడా వినిపించలేదు.

దీంతో ఒక ఆలోచన చేసిన అతను వెళ్లి.. దగ్గరలోని స్పీకర్ సౌండ్ పెంచాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక కంపెనీ.. ఈ స్టేడియంలో 'ఎంఎస్‌డీ.. ఎంఎస్‌డీ' అంటూ ఫ్యాన్స్ చేస్తున్న నినాదాలపై ఆసక్తి కనబరిచింది. ఆ నినాదాలను రికార్డు చేసి ఒక ఆసక్తికరమైన విషయం కనుగొంది.

అదేంటంటే.. ఈ స్టేడియంలో వినిపిస్తున్న ధోనీ.. ధోనీ నినాదాలు చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. సరిగ్గా చెప్పాలంటే ఇవి 120 డెసిబల్స్ వరకూ వెళ్తున్నాయని నిపుణులు చెప్పారు. సాధారణంగా విమానాలు వెళ్లే సమయంలో వచ్చే శబ్దం కన్నా ఇది ఎక్కువ అని ఎక్స్‌పర్ట్స్ ఫీల్ అయ్యారు. విమానం వెళ్లేప్పుడు కూడా 100 డెసిబల్స్ శబ్దం మాత్రమే వస్తుందని, కానీ ధోనీ కోసం 120 డెసిబల్స్ శబ్దంతో నినాదాలు చేశారని చెప్పారు. ఇలాంటి శబ్దాలను కనుక ఎవరైనా నేరుగా వింటే వారికి అనారోగ్యం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Story first published: Wednesday, May 31, 2023, 13:05 [IST]
Other articles published on May 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+