Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లోకల్ బాయ్ కోసం పోటెత్తిన ఢిల్లీ: సెహ్వాగ్ కుమారులతో కోహ్లీ సందడి

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023లో ఢిల్లీ కేపిటల్స్ మరో ఘన విజయాన్ని అందుకుంది. శనివారం రాత్రి మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. నిన్నటివరకు విజయాల కోసం మొఖం వాచిన ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకోగలిగింది. పాయింట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. భారీ లక్ష్యాన్ని సైతం ఢిల్లీ బ్యాటర్లు అలవోకగా ఛేదించడం ఈ మ్యాచ్ ప్రత్యేకత.

తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ- ఈ స్కోర్‌ను అవలీలగా కొట్టేసింది. ఈ క్రమంలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. 16.4 ఓవర్లలోనే 187 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్‌కు చేరే ఆశలను సజీవంగానే ఉంచుకొన్నప్పటికీ- అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇకపై ఆడబోయే అన్ని గేమ్‌లలోనూ భారీ తేడాతో నెగ్గితేనే ప్లేఆఫ్స్ చేరొచ్చు.

 IPL 2023

ఆర్సీబీ బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ తన దూకుడును కంటిన్యూ చేస్తోన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ బాదాడు. 46 బంతుల్లో అయిదు ఫోర్లతో 55 పరుగులు చేశాడు. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్-45, మహిపాల్ లోమ్రార్-54 సత్తా చాటారు. ఢిల్లీ కేపిటల్స్ ఇన్నింగ్‌లో మిఛెల్ మార్ష్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. కేప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్‌ను త్వరగానే కోల్పోయినప్పటికీ దాని ప్రభావం మిగిలిన బ్యాటర్లపై పడలేదు. బౌలర్లపై ఫిల్ సాల్ట్ విరుచుకుపడ్డాడు. 45 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 87 పరుగులు చేవాడు. రీలీ రొస్సౌ-35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌ను తిలకించడానికి ఢిల్లీ సెలెబ్రిటీలు తరలివచ్చారు. గతంలో ఢిల్లీలో నివసించాడు విరాట్ కోహ్లీ. పశ్చిమ్ విహార్‌లో అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. ఆ తరువాత గుర్‌గావ్‌లోని డీఎల్ఎఫ్ ఫేస్-1లో సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యారు. బాలీవుడ్ నటి అనూష్క శర్మతో పెళ్లయిన తరువాత తన కాపురాన్ని ముంబైకి షిఫ్ట్ చేశాడు కోహ్లీ. అలీబాగ్ ఏరియాలోని బంగ్లాలో నివాసం ఉంటోన్నాడు.

ఒకరకంగా విరాట్ కోహ్లీ లోకల్ బాయ్ కావడం వల్ల అతన్ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మాజీ క్రికెటర్లు సైతం స్టేడియంలో కనిపించారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కుమారులు స్టేడియానికి వచ్చారు. ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్.. వీఐపీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం వారిద్దరూ విరాట్ కోహ్లీని కలిశారు. అతనితో సరదాగా ఫొటోలు దిగారు.

Story first published: Sunday, May 7, 2023, 12:56 [IST]
Other articles published on May 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+