Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Varma: రోహిత్‌తో కలిసి ఆడటంపై హైదరాబాదీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆ జట్టు సాధించిన తొలి విజయం ఇదే. తొలి రెండు మ్యాచ్‌లల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓడిన అనంతరం ఈ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో నిలిచింది.

మరోవంక- ఢిల్లీ కేపిటల్స్ పరాజయాలకు మాత్రం బ్రేకులు పడట్లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టాల్సి ఉంది. మంగళవారం రాత్రి సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది వార్నర్ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 19.4 ఓవర్లల్లో 172 పరుగులకు ఆలౌట్ అయింది.

my childhood dream to bat with Rohit Sharma

ఢిల్లీ కేపిటల్స్‌లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. కేప్టెన్ డేవిడ్ వార్నర్-51, అక్షర్ పటేల్-54, మనీష్ పాండే-26 పరుగులు చేశారు. పృథ్వీ షా-15 సహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. యష్ ధుల్-2, రౌమన్ పావెల్-4, లలిత్ యాదవ్-2, అభిషేక్ పోరెల్-1, కుల్‌దీప్ యాదవ్-0, ఎన్రిచ్ నోర్ట్జే-5 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది. 20 ఓవర్లల్లో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. సారథిగా జట్టును ముందుండి నడిపించాడు. 45 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 65 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లోకి రావటం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం జట్టులో డబుల్ జోష్ నింపినట్టయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బౌలర్లకు చుక్కలు చూపాడు. తనదైన స్టైల్‌లో షాట్లు ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికే దక్కింది. అతని ఐపీఎల్‌ కేరీర్‌లో ఇది 16వది.

ఇదే మ్యాచ్‌లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ మరోసారి చెలరేగాడు. 29 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 41 పరుగులు చేశాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌పై 22, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తోన్నాడీ హైదరాబాదీ బ్యాటర్.

ఢిల్లీ కేపిటల్స్‌పై మ్యాచ్‌లో వన్ డౌన్ బ్యాటర్‌గా క్రీజ్‌లోకి దిగాడు తిలక్ వర్మ. ఓపెనర్ ఇషాన్ కిషన్ అవుట్ అయిన వెంటనే బరిలోకి వచ్చాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేశాడు. ఇది అతనికి చిరస్మరణీయమైన ఇన్నింగ్. రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయాలనేది తన చిన్నప్పటి కల అని, అది ఈ మ్యాచ్‌తో నెరవేరిందని చెప్పుకొచ్చాడు. రోహిత్‌తో కలిసి ఆడటాన్ని తాను ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించాడు. ఈ అవకాశం కోసం ఏడాదిగా ఎదురు చూస్తోన్నానని వివరించాడు.

Story first published: Wednesday, April 12, 2023, 11:25 [IST]
Other articles published on Apr 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+