Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకరికి తెలియకుండా మరొకరు.. ఢిల్లీ టీం ఎక్విప్‌మెంట్ చోరీ ఎలా జరిగిందంటే?

కొన్ని రోజుల క్రితం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత ఢిల్లీకి తిరిగెళ్లిన జట్టుకు షాకింగ్ విషయం తెలిసింది. ఈ టీం మెంబర్స్‌కు సంబంధించిన బ్యాట్లు, గ్లౌవ్స్, హెల్మెట్లు తదితర ఎక్విప్‌మెంట్‌ను ఎవరో దొంగిలించారు. ఈ దొంగిలించిన సామాగ్రి ధర కనీసం రూ.16 లక్షలు ఉంటుందని టీం మేనేజ్‌మెంట్ తెలిపింది.

ఈ దొంగతనం ఎలా జరిగింది? ఎవరు చేశారు? అని ఎవరికీ తెలియలేదు. అయితే తాజాగా దొంగలను పట్టుకున్న పోలీసులు.. దొంగిలించిన వస్తువుల్లో 70 శాతం రికవరీ చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను డీసీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. పోయిన వస్తువుల్లో వార్నర్, మిచెల్ మార్ష్, యష్ ధుల్ సహా పలువురు క్రికెటర్ల ఎక్విప్‌మెంట్ ఉన్నాయి.

delhi capitals bats robbery

ముంబైకి చెందిన ఎక్స్‌ప్రెస్ ఫ్రైట్ సొల్యూషన్స్ మేనేజర్ ఆనంద అగర్వాల ఈ దొంగతనంపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీ ఆటగాళ్ల ఎక్విప్‌మెంట్‌ను కియాకు పంపే సమయంలో ఈ చోరీ జరిగినట్లు ఆయన చెప్పారు. డీసీ ఆటగాళ్ల ఎక్విప్‌మెంట్‌ను ఐటీసీ గార్డీనియా హోటల్ నుంచి కియాకు పంపాలని లాజిస్టిక్స్ ఇన్‌చార్జి అర్వింద్ నేగి తమకు చెప్పినట్లు అగర్వాల వెల్లడించారు.

ఇలా తరలిస్తున్న సమయంలోనే మినీ గూడ్స్ క్యారియర్ డ్రైవర్ చెలువరాజ్ అలియాస్ నటరాజ్ (30), కొరియార్ బాయ్ సుధాంశు నాయక్ (30) ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. కియాకు వెళ్లే మార్గంలో యెలహంక సమీపంలో ఒక రెస్టారెంట్ వద్ద తన వాహనాన్ని చెలువరాజ్ ఆపాడు. అక్కడ డిన్నర్ చేసి, క్రికెటర్ల బ్యాగుల్లో నుంచి కొన్ని వస్తువులను తీసి ఒక బ్యాగులో పెట్టాడు. ఆ బ్యాగును రెస్టారెంట్ పక్కనే దాచిపెట్టి, మిగతా వస్తువులను కియాలో డెలివరీ ఇచ్చాడు.

ఇలా చెలువరాజ్ దొంగతనం చేసిన సమయంలోనే.. అతనికి కూడా తెలియకుండా సుధాంశు కూడా ఒక బ్యాట్ కొట్టేశాడు. అతను ఇలా బ్యాటు కొట్టేసిన విషయం చెలువరాజ్‌కు తెలీదు. అలాగే చెలువరాజ్ చేసిన ఘనకార్యం గురించి సుధాంశుకు తెలియదు. వీళ్లిద్దరూ తాము మాత్రమే ఈ చోరీ చేశామని అనుకున్నారు. అదే సమయంలో చెలువరాజ్ మరీ దారుణంగా 11 బ్యాట్లు సహా ఎక్విప్‌మెంట్ కొట్టేయడంతో ఇది పెద్ద ఇఫ్యూ అయింది.

ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు వీళ్లిద్దరూ దొంగతనం చేశారు. ఏప్రిల్ 16న ఢిల్లీలో ప్రాక్టీస్ చేసేందుకు వెళ్లిన సమయంలో ఆటగాళ్లకు తమ వస్తువులు దొంగలించారని అర్థమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా 24 గంటల్లోనే వారిని పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇది విన్న ఫ్యాన్స్.. ఇదేదో కామెడీ సినిమాలో చోరీ సీన్‌లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Sunday, April 23, 2023, 12:58 [IST]
Other articles published on Apr 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+