Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌పై ఆడటం అంటే ధోనీ భాయ్ ఎంత ఇష్టమో: ట్రాక్ రికార్డ్ ఇదే..

చెన్నై: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికరమైన పోరాటానికి తెర లేవనుంది. ఇవ్వాళ సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇది 29వ మ్యాచ్. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎయిడెన్ మార్క్‌రమ్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు.

సన్‌రైజర్స్ కంటే చాలా మెరుగ్గా ఉంది సీఎస్‌కే. ఇప్పటివరకు ఈ రెండు జట్లు అయిదేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాయి. సీఎస్‌కే మూడింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఖాతాలో ఉన్నవి రెండు విజయాలే. పాయింట్ల పట్టికలో ఈ టీమ్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. బలమైన సీఎస్‌కేను ఎదుర్కొనడానికి సన్‌రైజర్స్ కసరత్తు పూర్తి చేసింది.

 dhoni-

సన్‌రైజర్స్‌తో కంపేర్ చేసి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం మెరుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లో విజయం సాధించింది. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే- తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అగ్రస్థానానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ధోనీ కేప్టెన్సీలో ఇప్పటివరకు 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది చెన్నై సూపర్ కింగ్స్. నాలుగుసార్లు టైటిల్స్ గెలుచుకుంది. అయిదు సార్లు ఫైనల్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2008, 2009, 2018, 2021లో ఐపీఎల్ కప్‌ను ఎగరేసుకెళ్లిందీ ఎల్లో ఆర్మీ. 2016, 2017 సీజన్ల నుంచి తప్పుకొంది. ఆ రెండు సీజన్లల్లో సీఎస్‌కే ఫ్రాంఛైజీకి చోటు దక్కలేదు.

 dhoni-

కమ్ బ్యాక్ తరువాత మళ్లీ పట్టాలెక్కింది. 2021లో ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. నాలుగోసారి కప్‌ను ముద్దాడింది. 2000, 2022 సీజన్లల్లో అత్యంత అధ్వాన్న ఆటతీరును ప్రదర్శించింది చెన్నై సూపర్ కింగ్స్. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. ఈ సీజన్‌లో ఫర్వాలేదనిపించుకుంటోంది. ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో మూడు విజయాలను సాధించింది. ఇవ్వాళ ఆరో మ్యాచ్ ఆడబోతోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎంఎస్ ధోనీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 488 పరుగులు చేశాడు. 145.24 స్ట్రైక్ రేట్‌తో కదం తొక్కాడు. తన వ్యక్తిగత స్కోరింగ్ రికార్డ్‌ను పరుగులు పెట్టించాడు. సన్‌రైజర్స్‌పై అతని బ్యాటింగ్ యావరేజ్ 48.80. ఇంకో 12 పరుగులు చేస్తే 500 ల్యాండ్ మార్క్‌ను అందుకుంటాడు.

మొత్తం ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డును అందుకున్నాడు ఎంఎస్ ధోనీ. ఇప్పటివరకు 239 మ్యాచ్‌లను ఆడిన ధోనీ.. 5,037 పరుగులు చేశాడు. 82 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతని వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్ 84 నాటౌట్. 39.35 బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేశాడు. యావరేజ్ స్ట్రైక్ రేట్ 135.77. 24 హాఫ్ సెంచరీలను బాదాడు.

Story first published: Friday, April 21, 2023, 8:25 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+