Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌పై ధోనీ సేన మెగా అస్త్రం

చెన్నై: ఐపీఎల్ 2023లో భాగంగా ఇవ్వాళ సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇది 29వ మ్యాచ్. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎయిడెన్ మార్క్‌రమ్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు.

సన్‌రైజర్స్ కంటే బెటర్ పొజీషన్‌లో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటివరకు ఈ రెండు జట్లు అయిదేసి చొప్పున మ్యాచ్‌లను ఆడాయి. సీఎస్‌కే మూడింట్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఖాతాలో ఉన్నవి రెండు విజయాలే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది ఆరెంజ్ టీమ్. బలమైన సీఎస్‌కేను ఎదుర్కొనడానికి సన్‌రైజర్స్ కసరత్తు పూర్తి చేసింది.

 All-rounder Ben Stokes might return for todays match

మోకాలికి గాయం కావడం వల్ల సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌లను అతను ఆడలేదు. తాజాగా పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో అతను ఆడటం దాదాపుగా ఖాయమైంది. పూర్తిస్థాయిలో నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు స్టోక్స్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై మ్యాచ్‌కు అతను కమ్ బ్యాక్ అవుతాడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. స్టోక్స్‌ను గనక తుదిజట్టులో తీసుకుంటే- డ్వైన్ ప్రిటోరియస్‌ను పక్కన పెట్టొచ్చు. బెన్ స్టోక్స్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై సీఎస్‌కే కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా సానుకూలంగా స్పందించాడు. అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు.

దీనిపై తుది నివేదిక ఇంకా అందాల్సి ఉందని వ్యాఖ్యానించాడు. బెన్ స్టోక్స్‌ను జట్టులోకి తీసుకోవడం వల్ల బ్యాటింగ్, బౌలింగ్ విభాగం సమతూకమౌతుందని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు స్టోక్స్ ఆడింది రెండు మ్యాచ్‌లే. 18 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రాణించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. ఆ కొరతను సన్‌రైజర్స్‌పై తీర్చుకునే అవకాశం లేకపోలేదు.

Story first published: Friday, April 21, 2023, 9:50 [IST]
Other articles published on Apr 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+