Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని సేన గెలుపోటములపై తేల్చేసిన ఆకాశ్ చోప్రా

చెన్నై: ఐపీఎల్ 2023లో మరో ఆసక్తికరమైన పోరాటానికి తెర లేవనుంది. ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా రెండేసి చొప్పున విజయాలతో సమవుజ్జీగా నిలిచాయి. నెట్ రన్‌రేట్ ఆధారంగా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సీఎస్‌కే అయిదో స్థానంలో కొనసాగుతోంది.

కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఓ బిగ్ ఇన్నింగ్‌ను ఆశిస్తోన్నారు అభిమానులు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ధోనీ ఆడింది తక్కువ బంతులే. ఇన్నింగ్ చివర్లో బ్యాటింగ్‌కు దిగి తనదైన స్టైల్‌లో ఫినిష్ చేస్తూ వచ్చాడు. 260 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు ఈ మూడు మ్యాచ్‌లల్లో. అదే దూకుడుతో ఓ ఫుల్ ప్లెడ్డ్జ్ ఇన్నింగ్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఆ కోరిక ఇవ్వాళ్టి మ్యాచ్‌తో నెరవేరుతుందని ఆశిస్తోన్నారు అభిమానులు.

 Aakash Chopra predicts Chennai Super Kings going to win

చెన్నై సూపర్ కింగ్స్ మొదటి రెండు మ్యాచ్‌ల కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ దూరమైన నేపథ్యంలో మూడో మ్యాచ్ కోసం తుదిజట్టులో మార్పులు చేసింది. అజింక్య రహానేను తీసుకుంది. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు రహానే. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో కూడా అతణ్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు చెన్నై సూపర్ కింగ్స్‌కే ఉన్నాయని అంచనా వేశాడు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. సీఎస్‌కే తన హోమ్ పిచ్‌పై ఆడబోతోండటమే దీనికి కారణమని అభిప్రాయపడ్డాడు చెపాక్ స్టేడియంలో లోకల్ టీమ్‌కు విజయాల శాతం అధికంగా ఉందని, ఈ మ్యాచ్‌లోనూ దాన్ని కొనసాగిస్తుందని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్‌ జట్టు గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ- చెన్నై సూపర్ కింగ్స్‌ హోమ్ పిచ్ కావడం కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.

ఈ స్టేడియం- ధోనీ సేనకు పెట్టని కోట అని, పిచ్ స్థితిగతులపై సంపూర్ణ అవగాహన ఉందని అన్నాడు. అదే సమయంలో అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ధోనీ.. ఆ జట్టుకు కేప్టెన్‌గా వ్యవహరిస్తోండటం అదనపు బలమని పేర్కొన్నాడు. పైగా ఇదే స్టేడియంపై బలమైన లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించిందని గుర్తు చేశాడు. ఆ మ్యాచ్‌లో యంగ్ ప్లేయర్లందరూ రాణించారని, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, April 12, 2023, 14:05 [IST]
Other articles published on Apr 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+