For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs LSG Playing 11: ధోనీపై అనుమానాల్లేవ్

చెన్నై: మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- ఐపీఎల్ 2023 సీజన్‌లో తన రెండో మ్యాచ్ ఇవ్వాళ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఎల్‌ఎస్జీ ఇప్పటికే ఓ గెలుపు అందుకుంది. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను మట్టి కరిపించింది. సీజన్‌లో బోణీ కొట్టింది. ఆ అవకాశం ఇంకా సీఎస్‌కే దక్కలేదు. ఆ కొరతను హోమ్ పిచ్ మీద తీర్చుకునే అవకాశాలు లేకపోలేదు.

అహ్మదాబాద్‌లో జరిగిన సీజన్ ఓపెనర్‌లో గుజరాత్ టైటాన్స్‌ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ- జట్టులో పెద్దగా మార్పులు చేర్పులు చేయకపోవచ్చు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను ఆడిన జట్టుతోనే బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది. దక్షిణాఫ్రికాకు చెందిన సిసండ మగల ఇవ్వాళో, రేపో జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ముగిసిన నేపథ్యంలో అతను భారత్‌కు బయలుదేరనున్నాడు.

IPL 2023, CSK vs LSG Playing 11: MS Dhoni return to home ground after a gap of 3 years

గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్ సందర్భంగా ధోనీ మోకాలికి గాయమైంది. బంతిని అందుకునే క్రమంలో అతను ఎడమవైపు డైవ్ చేసినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం వికెట్ల వెనుకల కొంత ఇబ్బందికరంగా కనిపించాడు ధోనీ. అతని ఫిట్‌నెస్‌పై మొదట్లో అనుమానాలు వ్యక్తం అయినప్పటికీ- హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ దీనిపై వివరణ ఇచ్చాడు. ధోనీ ఫిట్‌నెస్‌పై ఎలాంటి అనుమానాలు లేవని, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని చెప్పాడు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో అతను ఆడతాడనీ స్పష్టం చేశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ లో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అందుబాటులోకి రానున్నాడు. నిన్నటి వరకు తన దేశం తరఫున నెదర్లాండ్స్‌తో వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు డికాక్. ఆ సిరీస్ ముగియడంతో ఐపీఎల్‌కు ఎంపికైన దక్షిణాఫ్రికా ప్లేయర్లందూ భారత్‌కు బయలుదేరారు. తమ జట్లకు అందుబాటులోకి వచ్చారు. ఇవ్వాళ్లి మ్యాచ్ లో డికాక్‌ను ఆడించే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఓపెనర్ కైలే మేయర్స్ సత్తా చాటిన నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టకపోవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టులో.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (కెప్టెన్ వికెట్‌కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజవర్ధన్ హంగర్గేకర్ ఆడొచ్చు. ఎల్‌ఎస్జీలో- కేఎల్ రాహుల్ (కెప్టెన్ వికెట్ కీపర్), కైలే మేయర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Monday, April 3, 2023, 8:20 [IST]
Other articles published on Apr 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+