Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : అతన్ని మిస్ చేసుకున్న బాధ ఇప్పటికీ ఉంది: చెన్నై హెడో కోచ్ ఫ్లెమింగ్

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్పిన్నర్లు.. మరీ ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఇద్దరూ చెన్నైని ముప్పుతిప్పలు పెట్టారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తి చెన్నై జట్టు నెట్ బౌలర్‌గా ఉండే వాడు.

ఇదే విషయాన్ని ఈ మ్యాచ్ అనంతరం చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా గుర్తుచేశాడు. వరుణ్ సత్తా గురించి తమకు బాగా తెలిసినా కూడా అతన్ని జట్టులోకి తీసుకోవడంలో చెన్నై విఫలమైంది. చెన్నై నెట్ బౌలర్‌గా ఉన్న అతన్ని 2019 వేలంలో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

Varun Chakravarthy

ఆ ఫ్రాంచైజీలో వరుణ్ పెద్దగా రాణించలేదు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చేరిన తర్వాత వరుణ్ కెరీర్ పూర్తి టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే అతన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ తాను బాధ పడుతూనే ఉంటానని ఫ్లెమింగ్ అన్నాడు. కర్ణాటకకు చెందిన వరుణ్ నెట్స్‌లో తమ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టేవాడని గుర్తుచేసుకున్నాడు.

'వేలంలో వరుణ్‌ను కొనలేకపోయాం అనే బాధ నాకు ఇప్పటికీ ఉంది. చాలా ఏళ్ల పాటు మమ్మల్ని అతను నెట్స్‌లో టార్చర్ చేశాడు. కానీ వేలం మాకు అనుకూలంగా వెళ్లలేదు. దీంతో అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోలేకపోయాం. అన్ని టీమ్స్‌లో తమిళనాడు ప్లేయర్స్ ఉండటంతో వరుణ్‌ గురించి సీక్రెట్‌గా ఉంచలేకపోయాం. అందరూ అతని కోసం పోటీ పడ్డారు' అని ఫ్లెమిగ్ వివరించాడు.

తమ జట్టులో వరుణ్ ఉంటే చాలా బాగుండేదన్న ఫ్లెమింగ్.. కానీ అది జరగకపోవడం దురదృష్టకరం అన్నాడు. ఈ సీజన్‌లో వరుణ్ ఇప్పటి వరకు 19 వికెట్లతో రాణించాడు. 'నెట్స్‌లో అతని బౌలింగ్ చూసి మేం చాలా ఎగ్జయిట్ అయ్యాం. అతను మాతోనే ఉండి ఉంటే ఇంకా సంతోషించేవాళ్లం. ఈ రోజు తను సూపర్‌గా బౌలింగ్ చేశాడు. నరైన్, వరుణ్ ఇద్దరూ చాలా ప్రమాదకరమైన కాంబో. కోల్‌కతాలో వాళ్ల బౌలింగ్‌కు అనుకూలించే పిచ్ దొరకదేమో.. కానీ ఇక్కడకు వచ్చాక వాళ్లను ఆపడం కష్టం' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, May 15, 2023, 21:10 [IST]
Other articles published on May 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+