ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 మొదటి రోజున డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో MS ధోని కొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. IPL టోర్నమెంట్ చరిత్రలో 5000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 7వ ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ అనే రెండు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన ధోని ఇప్పటివరకు ఐపీఎల్ లీగ్‌లో 4978 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ధోని 22 పరుగులు చేస్తే 5000 పరుగుల మార్క్‌ను దాటతాడు. ఈ జాబితాలో 223 మ్యాచ్‌ల్లో 6624 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ 223 మ్యాచ్ ల్లో 36.20 యవరేజ్, 129 స్ట్రైక్ రేట్ తో ముందున్నాడు.

శిఖర్ దావన్ 206 మ్యాచ్ ల్లో 35 సగటు, 126 స్ట్రైక్ రేటుతో రెండో స్థానంలో ఉన్నాడు. ధోని 234 మ్యాచ్ ల్లో 39 సగటు, 135 స్ట్రైక్ రేట్ తో ఏడో స్థానంలో ఉన్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
గుజరాత్ టైటాన్స్:
హార్దిక్ పాండ్యా (సి), శుభమాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే , జయంత్ యాదవ్, R. సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఓడియన్ స్మిత్, KS భరత్, శివం మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్:
ఎంఎస్ ధోని (సి), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, మఠీ సింగజేత్, ముఖేష్ చౌదరి సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, సిసంద మగల, అజయ్ మండల్, భగత్ వర్మ