IPL 2023 : గిల్ సూపర్ కానీ.. అతన్ని కోహ్లీతో పోల్చడమా?
ఐపీఎల్‌లో ఈ ఏడాది అదరగొట్టిన బ్యాటర్ శుభ్‌మన్ గిల్. సీజన్ ఆరంభం నుంచే మంచి ఫామ్ కనబరిచిన అతను.. చివర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏకంగా 890 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో అతన్ని సచిన్, కోహ్లీలతో ఫ్యాన్స్ పోల్చడం మొదలు పెట్టారు.
అయితే అలా గిల్‌ను సచిన్‌తో కానీ, కోహ్లీతో కానీ పోల్చడం ఏమాత్రం సరికాదని గుజరాత్ టైటాన్స్ మెంటార్ గ్యారీ కిర్‌స్టన్ అన్నాడు. 'గిల్ ఒక యంగ్ ప్లేయర్. కాకపోతే ప్రపంచంలో బెస్ట్ ప్లేయర్లలో ఒకడిగా నిలవాలనే పట్టుదల, నైపుణ్యం ఉన్న కుర్రాడు. కానీ అతన్ని అప్పుడే సచిన్, విరాట్‌తో పోల్చడం కరెక్ట్ కాదు. అయితే అన్ని ఫార్మాట్లలో ఆడగలిగే టెక్నిక్ అతనికి ఉంది' అని కిర్‌స్టన్ చెప్పాడు.

గిల్ వంటి ట్యాలెంట్ అంత ఈజీగా దొరకడం చాలా కష్టం అని కిర్‌స్టన్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్ ఇంత పాపులర్ అవుతున్న సమయంలో ఇలాంటి ట్యాలెంట్ దొరకడం చాలా గొప్ప విషయం అని చెప్పాడు. అలాగే తన ఆటను మరింత మెరుగు పరుచుకున్న గిల్ ఈ ఏడాది అద్భుతమైన స్థాయిని చేరుకున్నాడని, అదే సమయంలో తనకు దక్కుతున్న పొగడ్తలు చూసి పొంగిపోలేదని కొనియాడాడు.
'కాన్ఫిడెన్స్, అలాగే తన సత్తా ఏంటో తెలుసుకోవడం గిల్ ప్రధానమైన బలాలు. అలాగే అతని వర్క్ ఎథిక్స్, ప్రతి మ్యాచ్‌కు ముందూ రెడీ అయ్యే ప్రొఫెషనలిజం కూడా చాలా బాగుంటుంది. తన సత్తాకు తగ్గ ప్రదర్శన చేయడంతోపాటు ఆటను అర్థం చేసుకునే నైపుణ్యం కూడా గిల్‌కు ఉన్న మంచి బలమే. ఈ సీజన్‌లో తన బలాలను చక్కగా అర్థం చేసుకున్న గిల్.. వాటిని సరైన టైంలో వాడుకొని అదరగొట్టాడు' అని కిర్‌స్టన్ తెగ మెచ్చుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications