For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబోయ్.. ఈ కావ్యా పాప ఎంత పని చేసింది: రాత్రికి రాత్రి సంచలనం

 IPL 2023: Brian Lara likely to replace Sunrisers Hyderabad coach Tom Moody after part ways

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్యా మారన్.. రాత్రికి రాత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ వేడిని ఇప్పుడే రాజేశారు. ఈ సీజన్ ఆరంభం కావడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే దిద్దుబాటు చర్యలకు దిగారు. కొన్ని సీజన్లుగా టీమ్ చెత్త ప్రదర్శన సాగిస్తూ వస్తోన్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలను తీసుకుంటోన్నారు. విజయాలను సాధించడమే లక్ష్యంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.

మూడీకి గుడ్‌బై..

మూడీకి గుడ్‌బై..

హెడ్ కోచ్ టామ్ మూడీకి గుడ్‌బై చెప్పింది సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్. ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించకూడదని కావ్యా మారన్ నిర్ణయించారు. ఇకపై ఆయన తమ జట్టుతో కొనసాగబోరని తేల్చి చెప్పారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ పొడిగించవద్దంటూ టామ్ మూడీ సైతం సంకేతాలను పంపించారని, అందుకే ఆయనకు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపింది. రెండు దఫాలుగా ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించింది. మూడోసారి ఆ నిర్ణయం తీసుకోవట్లేదు.

 మూడీ స్థానంలో..

మూడీ స్థానంలో..

టామ్ మూడీ స్థానంలో వెస్టిండీస్‌కు చెందిన లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా‌కు అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టామ్ మూడీ స్థానాన్ని లారాతో భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌‌‌కు వ్యూహాత్మక సలహాదారుగా, బ్యాటింగ్ కోచ్‌గా పని చేశారు బ్రియాన్ లారా. ఆయన ఫ్రంట్ రన్నర్‌గా ఉంటోన్నారు. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. లారాకే ఛాన్స్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి.

డెసర్ట్ వైపర్స్ డైరెక్టర్‌గా..

డెసర్ట్ వైపర్స్ డైరెక్టర్‌గా..

వచ్చే ఏడాది జనవరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రారంభం కానున్న ఐఎల్టీ 20కి చెందిన డెసర్ట్ వైపర్స్‌ టీమ్‌ డైరెక్టర్‌గా టామ్ మూడీ అపాయింట్ అయ్యారు. ఆయనకు ఎస్‌ఆర్‌హెచ్ గుడ్‌బై చెప్పడానికి ఇదొక కారణంగా భావిస్తోన్నారు. ఐపీఎల్, ఐఎల్టీకి ఒకేసారి సేవలను అందించడంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో టామ్ మూడీకి వీడ్కోలు పలకాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావించింది. కాంట్రాక్ట్‌ు పొడిగించకూడదని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

రెండుసార్లు..

రెండుసార్లు..

ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ రెండుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. ఆయన హయాంలో ఐపీఎల్ మొత్తంగా తొమ్మిది సీజన్లను ఎదుర్కొంది సన్‌రైజర్స్. అయిదుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2016లో టైటిల్‌ను గెలుచుకుంది. గ్లోబల్ T20 కెనడాలో మాంట్రియల్ టైగర్స్‌కు సేవలందించాలనే ఉద్దేశంతో 2019లో సన్‌రైజర్స్‌కు దూరం అయ్యాడు. అప్పట్లో ఆయన స్థానాన్ని ట్రెవర్ బేలిస్ భర్తీ చేశారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.

సెకెండ్ ఫేస్‌లో ఫెయిల్యూర్..

సెకెండ్ ఫేస్‌లో ఫెయిల్యూర్..

సెకెండ్ ఫేస్‌లో టామ్ మూడీ హయాంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా రాణించలేదు. మొత్తంగా 28 మ్యాచ్‌లలో గెలిచింది తొమ్మిదే. 18 మ్యాచ్‌లల్లో ఓటమి పాలైంది. 2021, 2022 సీజన్లల్లో దారుణంగా విఫలమైంది. 2021లో మూడు విజయాలను మాత్రమే అందుకుంది సన్‌రైజర్స్. ఈ సీజన్‌లో ఆరింట్లో గెలిచింది. ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Story first published: Saturday, September 3, 2022, 7:54 [IST]
Other articles published on Sep 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+