Yuzvendra Chahal: షేన్ వార్న్ నన్ను పై నుంచి చూస్తునే ఉన్నాడు.. ఆయన బ్లెస్సింగ్స్ నా మీద ప్రసరిస్తున్నాయి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతను 14మ్యాచ్‌లలో 26వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల (పర్పుల్ క్యాప్ రేసు)లో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ టాప్ 2 స్థానం సంపాదించిన జట్టుగా నిలవడానికి ప్రధాన కారణాల్లో యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ కూడా ఒకటి. ఇక మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడబోతుంది.
ఇక ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన ఐపీఎల్ 2008లో రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించిన కెప్టెన్ ఫస్ట్ రాయల్ ఆఫ్ ది ఫ్రాంఛైజీ షేన్ వార్న్‌కు క్వాలిఫయర్ మ్యాచ్ ముందు చాహల్ స్పెషల్‌గా నివాళులర్పించాడు. ఇక ఈ ఏడాది మార్చిలో వార్న్ అకాల మరణంతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. వార్న్ అనుమానాస్పదంగా గుండెపోటుతో థాయ్‌లాండ్‌లో మరణించాడు.

చాలా సంవత్సరాలుగా రాజస్థాన్ తరఫున ఆడుతున్నట్లు
'నేను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడడం తొలిసారి. కానీ నేను చాలా సంవత్సరాలుగా రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే జట్టు ఒక కుటుంబంలా ఉంది. నేను ఇక్కడ మానసికంగా చాలా రిలాక్స్‌గా ఉన్నాను. మంచి క్రెడిట్ దక్కుతుంది. ఇక్కడి ఫ్రాంఛైజీ వారు నన్ను నిజంగా బాగా చూసుకుంటున్నారు. ప్లేయింగ్ టీమ్ మాత్రమే కాకుండా, సపోర్టింగ్ స్టాఫ్, మేనేజ్‌మెంట్‌కు కూడా నేను నిజంగా విలువైన ప్లేయర్ అనేలా నన్ను చూస్తున్నారు అని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చాహల్ పేర్కొన్నాడు.

వేరే లెవల్లో ఫ్రాంఛైజీతో కనెక్టయ్యాను
'నాకు ఇక్కడ దక్కుతున్న ప్రేమాభిమానాలు.. నిజంగా నన్ను వేరే లెవెల్లో రాజస్థాన్ ఫ్రాంచైజీతో కనెక్ట్ అయ్యేలా చేసింది. మరోవైపు.. రాజస్థాన్ రాయల్స్ నాకు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే నేను ఆరాధించే షేన్ వార్న్ సార్ రాజస్థాన్ కోసం ఆడాడు. ఆయనే ఫస్ట్ రాయల్‌గా ఈ జట్టుకు ట్రోఫీ అందించాడు. ఆయన ఆశీర్వాదాలు తప్పకుండా నా మీద ప్రసారిస్తాయి అనుకుంటున్నా. అతను నన్ను పై నుండి చూస్తునే ఉంటాడని భావిస్తున్నా' అని చాహల్ పేర్కొన్నాడు.

గుజరాత్ కన్నా రాజస్థాన్ కొంచెం బెటర్‌గా ఉంది
ఇకపోతే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీ నేటి క్వాలిఫయర్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. రాజస్థాన్ టీంలో ముగ్గురు అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నందున సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ కంటే కొంచెం విన్నింగ్ అవకాశాలు ఎక్కువ కలిగి ఉందని చెబుతాను.
నేను అశ్విన్, చాహల్ స్పిన్ ద్వయాన్ని బాగా ఇష్టపడుతాను. వీరిద్దరు రాజస్థాన్‌కు మిడిల్ ఓవర్లలో జట్టుకు మేలు చేకూర్చే బౌలింగ్ వేయగలరు. వీరిద్దరితో పాటు ట్రెంట్ బౌల్ట్ కారణంగా రాజస్థాన్, గుజరాత్‌తో పోల్చితే కొంచెం బెటర్‌గా ముందుందని నేను భావిస్తున్నాను' అని వెటోరీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications