Yuvaraj singh: మళ్లీ పాత కోహ్లీని బయటికి తీయ్.. అప్పుడు నీకు సాటి ఎవరూ ఉండరు

ఐపీఎల్ - 2022లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చుతున్నాడు. ఫామ్ లేమితో సతమతమవుతున్న ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్.. ఈ సీజన్లో 9మ్యాచ్‌లలో కేవలం 128పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ సగటు 16మాత్రమే. అతను తన చివరి నాలుగు ఇన్నింగ్స్‌లలో రెండంకెల మార్కును కూడా తాకలేకపోయాడు. చివరగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 9పరుగులు చేశాడు. అంతకుముందు రెండు సార్లు డకౌట్ అయ్యాడు. అతని బ్యాటింగ్ ఫామ్ భారీ పతనంలో ఉండడంతో క్రికెట్ ఉద్ధండులు, మాజీలు అతనికి కొన్ని సలహాలు ఇస్తున్నారు. కోహ్లీ తిరిగి తన బ్యాటింగ్ వైభవాన్ని కొనసాగించడానికి కావాల్సిన మార్గాలను సూచిస్తున్నారు.

15ఏళ్లలో ఇవ్వాల్సినదానికంటే నాలుగు రెట్లు ఎక్కువే ఇచ్చాడు
భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి... కోహ్లీ కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని సూచించాడు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సైతం కోహ్లీ ఒకట్రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని, లేకపోతే నంబర్ 5స్థానంలో బరిలోకి దిగాలని ఇటీవల సూచించాడు. ఇక తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. కోహ్లీ తన గత ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాలని సూచించాడు. కోహ్లీ క్రికెట్లో తన యంగర్ డేస్‌ను తిరిగి గుర్తుతెచ్చుకోవాల్సిన అవసరముందని, మరియు అతను ఎదుర్కొంటున్న ప్రస్తుత పతనాన్ని సరిదిద్దడానికి యంగ్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించేవాడో తరచి చూసుకోవాలని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ 18కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన యువరాజ్ మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లలో నేను చూసిన క్రికెటర్లందరి కంటే.. కోహ్లీ నాలుగు రెట్లు గొప్ప ఆటతీరు కనబరిచాడు. కోహ్లీ ఫామ్ ఇప్పుడేం బాలేదు. అతను కూడా తన ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేడు. అతని అభిమానుల సైతం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే అతను క్రికెట్లో పెద్ద బెంచ్‌మార్క్‌లు సెట్ చేశారు. కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు బాదడాన్ని మనం చూశాం. అలాంటి క్రికెట్ ఆడడం అత్యుత్తమ క్రికెటర్లతోనే సాధ్యపడుతుంది.' అని యువరాజ్ పేర్కొన్నాడు.

మళ్లీ స్వేచ్ఛగా ఆడు కోహ్లీ
'విరాట్ మళ్లీ స్వేచ్ఛగా ఆడేలా మారాలి. అతను తనను తాను మార్చుకోగలిగితే, మునుపటిలా ఉండగలిగితే అది అతని ఆటలో కన్పించడం ఖాయం. ఎందుకంటే అతను ఈ తరంలోనే అత్యుత్తమ ప్లేయర్. నిజాయతీగా కష్టపడడాన్ని అతను నమ్ముతాడు. అందుకే సంవత్సరాల తరబడి అతని నుండి అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి.' అని యువరాజ్ పేర్కొన్నాడు.

చివరి అయిదు మ్యాచ్‌ల్లో కోహ్లీ చేసింది 22పరుగులే
బ్యాటింగ్ కింగ్ కోహ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవట్లేదు. చివరి అయిదు మ్యాచ్‌లల్లో అతను చేసింది 22 పరుగులే. ఇందులో రెండు గోల్డెన్ డకౌట్స్ ఉన్నాయి. చివరి అయిదింట్లో 1, 12, 0, 0, 9 పరుగులు చేశాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. ఈ డిజిట్స్ కోహ్లీ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. ఈ పరిణామాలు అటు విరాట్ కోహ్లీనే కాదు.. అతని అభిమానులను కూడా తీవ్ర నిరాశ, ఆవేదనకు గురి చేస్తోన్నాయి. మాజీ క్రికెటర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications