కావ్యా పాపను సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఎంతమాటనేశారు: మీకు చేతకాకపోతే..ఆ పని చేయండి

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో తన ప్రస్థానాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్.. అవమానకర ఓటమితో ఆరంభించింది. మున్ముందు కఠిన సవాళ్లను ఎదుర్కోనున్న పరిస్థితుల్లో తొలి అడ్డంకిని అధిగమించలేక చతికిలపడింది. తొలి మ్యాచ్ ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరజయాన్ని చవి చూసింది. ప్రత్యర్థి జట్టుకు ఏకంగా 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశాన్ని ఇవ్వడం.. దాన్ని అందుకోలేక చేతులెత్తేయడం చకచకా జరిగిపోయాయి. 200లకు పైగా స్కోర్‌ను ఛేదించాల్సిన బ్యాటర్లు.. కనీసం ప్రతిఘటించలేకపోయారు.
ఫ్యాన్స్ ఫైర్..
ఈ పరిణామాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమనుల్లో తీవ్ర అసహనాన్ని, ఆగ్రహావేశాలకు కారణమైంది. సోషల్ మీడియా ద్వారా ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు. తమ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అకౌంట్లకు పని చెప్పారు. మెమెస్‌తో సెటైర్లను సంధిస్తోన్నారు.. ట్రోల్స్‌తో మేనేజ్‌మెంట్‌పై దాడి చేస్తోన్నారు. ఘాటు పదాలను ప్రయోగించడానికీ వెనుకాడట్లేదు. తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ టీమ్.. తమ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిందంటూ నిప్పులు చెరుగుతున్నారు.
ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు..
తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయిన జట్టు- ఇక మున్ముందు మరిన్ని కఠినమైన మ్యాచ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వాటిల్లో గెలుస్తుందని ఎలా నమ్ముతామని నిలదీస్తోన్నారు. కోట్లాదిమంది అభిమానుల భావోద్వేగాలతో సన్‌రైజర్స్ టీమ్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఆటలాడుకుంటోందని మండిపడుతున్నారు. తెలుగు ప్రజల ఎమోషన్స్‌ను అర్థం చేసుకోలేనప్పుడు, దాన్ని సీరియస్‌గా తీసుకోలేనప్పుడు హైదరాబాద్ బ్రాండ్‌నేమ్‌ను వదులుకోవాలని సలహా ఇస్తోన్నారు.
అమ్మేసుకోండి..
తెలుగు ప్రజలు మనోభావాలు, భావోద్వేగాలకు అనుగుణంగా జట్టును సెలెక్ట్ చేసుకోలేకపోయిందని అభిమానులు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్‌పై భగ్గుమంటున్నారు. మెగా వేలంపాట సందర్భంగా- ఇతర ఫ్రాంఛైజీలు మెరికల్లాంటి ప్లేయర్లను ఎగరేసుకెళ్లారని, ఆ పని సన్‌రైజర్స్ చేయలేకపోయిందని గుర్తు చేస్తోన్నారు. తమ ఎమోషన్స్‌ను సీరియస్‌గా తీసుకోవడం తెలియకపోతే.. ఫ్రాంఛైజీని హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీకి దాన్ని అమ్మేసుకోవాలని సూచించారు.
పూరన్.. నో రన్
పించ్ హిట్టర్ నికొలస్ పూరన్‌పై అభిమానులు నిప్పులు చెరిగారు. తొమ్మిది బంతులను ఎదుర్కొన్న పూరన్ డకౌట్ అయ్యాడు. అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇంతకుముందు నాటి సిరీస్‌లో అతను విజృంభించిన విషయం తెలిసిందే. వరుసగా అర్ధసెంచరీలతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం సున్నాకే అవుట్ కావడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. పూరన్ తన పేరును నో రన్‌గా మార్చుకోవాలంటూ సెటైర్లు సంధిస్తోన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications