IPL 2022: అది సస్పెన్సే.. ఓడిపోతే నాదే బాధ్యత.. హార్దిక్ పాండ్యా ఆసక్తిరక వ్యాఖ్యలు

అహ్మదాబాద్: మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 2022 ప్రారంభం కాబోతుంది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు ఈ మెగా లీగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం పలు జట్లు ఇప్పటికే ప్రాక్టీసు కూడా మొదలు పెట్టేశాయి. అలాగే అనేక జట్లు ఐపీఎల్ 2022 కోసం కొత్త జెర్సీతో వస్తున్నాయి. ఈ నేపథ్యంటో ఐపీఎల్‌లోకి ఈ సారి కొత్తగా ప్రవేశించిన గుజరాత్ టైటాన్స్ కూడా ఆదివారం తమ జెర్సీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తిర విషయాలు వెల్లడించాడు.
అది సస్పెన్సే
సర్జరీ అయిన తర్వాత చాలా కాలం నుంచి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ జెర్సీ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పాండ్యాను ఓ జర్నలిస్టు దీనిపై ప్రశ్నించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున బౌలింగ్ చేస్తారా? లేదా? అని సందరు జర్నలిస్టు అడగగా.. దానికి పాండ్యా ఆ విషయం సస్పెన్స్‌గానే ఉంటుందని తెలివిగా సమాధానమిచ్చాడు. దీంతో అక్కడ కాసేపు నవ్వులు అలుముకున్నాయి. కాగా 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత వెన్నుముకకు శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్ పాండ్యా ఆ తర్వాత పెదగా బౌలింగ్ చేయలేదు.

ఆ సమయంలో అండగా ఉంటాం
అలాగే తన కెప్టెన్సీపై కూడా హార్దిక్ పాండ్యా స్పందించాడు. కెప్టెన్సీ అనేది ఆటగాళ్లను ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. జట్టు విజయాలు సాధిస్తే ఆ ఘనత ఆటగాళ్లకు దక్కుతుందని, ఒక వేళ ఓడిపోతే ఆ ఓటములకు తానే బాధ్యత వహిస్తానని పాండ్యా తెలిపాడు. వీలైనంతవరకు ఆటగాళ్లను సంతోషంగా ఉంచడమే తన కర్తవ్యమని చెప్పాడు. జట్టు విజయాలు సాధిస్తున్నప్పుడు ఆటగాళ్లకు ఇతరుల సపోర్టు అవసరం లేదని, కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తాము కచ్చితంగా అండగా ఉంటామని హార్దిక్ పాండ్యా భరోసానిచ్చాడు.

ఇంట్లో ఉంటున్నామనే భావన
ఆటగాళ్లకు తమ ఇంట్లో ఉంటున్నామనే భావన కల్గేలా తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాళ్లకు సొంత భావన అనిపించేలా చూస్తామని ఆయన చెప్పాడు. కాగా హార్దిక్ పాండ్యాను మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ 15 కోట్ల రూపాయల భారీ ధరకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, 2016 విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో కలిసి గుజరాత్ టైటాన్స్ గ్రూప్ బీలో ఉంది.

గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు
హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, ప్రదీప్ దయాల్, ప్రదీప్ దయాల్ , డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి. సాయి సుదర్శన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications