For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: హార్దిక్‌కు ఫిట్‌నెస్ టెస్ట్‌.. గుజరాత్‌కు కెప్టెన్ అవుతాడా? ఎన్సీఏ ప‌రీక్ష‌లో ఫెయిల్ అవుతాడా?

IPL 2022: Will Hardik Pandya CaptaIPL 2022: Will Hardik Pandya Captain For Gujarat Titans Or Fail In The NCA Fitness Test?in For Gujarat Titans Or Fail In The NCA Fitness Test?

బెంగ‌ళూరు: ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు కొత్త ఫ్రాంచైజీ గుజ‌రాత్ టైటాన్స్ పెద్ద ఎదురుదెబ్బ త‌గిలేలా ఉంది. ఐపీఎల్ 2022లో ఆడాలంటే హార్దిక్ పాండ్యా క‌చ్చితంగా నేష‌నల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్సీఏ)లో నిర్వ‌హించే ఫిట్‌టెస్ టెస్ట్‌లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఎన్సీఏలో నిర్వ‌హించే ఫిట్‌నెస్ టెస్ట్‌లో క‌నుక హార్దిక్ పాండ్యా ఫెయిలైతే అత‌ను ఐపీఎల్‌లో ఆడ‌డానికి బీసీసీఐ అనుమ‌తించ‌దు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే ఇది గుజ‌రాత్ టైటాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ‌గా మారే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎన్సీఏలోకి హార్దిక్ పాండ్యా

ఎన్సీఏలోకి హార్దిక్ పాండ్యా

ప్ర‌స్తుతం త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవ‌డానికి తాజాగా హార్దిక్ పాండ్యా నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్సీఏ)లో చేరాడు. రెండు రోజుల‌పాటు ఎన్సీఏలోనే ఉండి అక్క‌డ నిర్వ‌హించే అన్ని ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొనున్నాడు. అత‌ను బీసీసీఐ రూల్స్ ప్ర‌కారం అన్ని ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు పాసైతేనే ఐపీఎల్ 2022లో ఆడ‌డానికి అనుమ‌తి ల‌భిస్తుంది.

అయితే ఎన్సీఏలో చేర‌డానికి ముందు హార్దిక్ పాండ్యా గుజ‌రాత్ టైటాన్స్ నిర్వ‌హించిన రెండు ప్రాక్టీస్ సెష‌న్‌ల‌లో బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో పాండ్యా బౌలింగ్ చేస్తాడా? లేదా? అనేది ఆస‌క్తిర‌కంగా మారింది. గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు జెర్సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ఈ ప్ర‌శ్న ఎదుర‌వ‌గా స‌మాధానాన్ని పాండ్యా దాట‌వేశాడు. గ‌తంలో గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మైన శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎన్సీఏలో నిర్వ‌హించిన ఫిట్‌నెస్ టెస్టుల్లో పాస్ అయ్యాకే ఐపీఎల్‌లో ఆడ‌డానికి బీసీసీఐ అనుమ‌తించింది.

వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి దూరం

వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి దూరం

కాగా గ‌తేడాది యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత గాయాలతో హార్దిక్ పాండ్యా టీమిండియాకు దూర‌మ‌య్యాడు. వెస్టిండీస్‌, శ్రీ‌లంక‌తో సిరీస్‌లో బ‌రిలోకి దిగాల‌ని భావించిన‌ప్ప‌టికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డంతో సెలెక్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు. రంజీల్లో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాల‌ని సూచించిన‌ప్ప‌టికీ హార్దిక్ పాండ్యా మాత్రం రంజీ ట్రోఫీలో ఆడ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ స్థాయి ఎలా ఉంద‌నే అంశం తెలియాల్సి ఉంది. ఒక వేళ పాండ్యా ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫ‌లమైతే గుజ‌రాత్‌ను న‌డిపించే నాయ‌కుడెవ‌రనేది తేలాల్సి ఉంది.

వారంతా పాస్‌

వారంతా పాస్‌

కాగా ఎన్సీఏ సోమ‌వారం నిర్వ‌హించిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన యోయో టెస్ట్‌లో ప‌లువురు ఆట‌గాళ్లు ఉత్తీర్ణులుగా నిలిచారు. ఈ యోయో టెస్ట్ పాసైన వారిలో షాబాజ్ అహ్మద్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. యోయో టెస్టులో పాస్ కావ‌డంతో ప్ర‌స్తుతం వీరంతా త‌మ త‌మ జ‌ట్ల‌ల్లో చేర‌డానికి సిద్ధంగా ఉన్నారు. కాగా యోయో టెస్టులో పాస్ కావాలంటే 19.5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.

IPL 2022 : 3 Teams That Can Give Tough Fight To Mumbai Indians | Oneindia Telugu
గుజ‌రాత్ టైటాన్స్ పూర్తి జ‌ట్టు ఐపీఎల్ 2022

గుజ‌రాత్ టైటాన్స్ పూర్తి జ‌ట్టు ఐపీఎల్ 2022

హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్‌రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్, , డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్

Story first published: Tuesday, March 15, 2022, 12:42 [IST]
Other articles published on Mar 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+