కోహ్లీ వారసుడొచ్చేశాడు: రాయల్ ఛాలెంజర్స్ కొత్త కేప్టెన్ అతనే

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్ తొలి రోజు వేలంపాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిక్స్డ్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త, పాత ప్లేయర్లను తీసుకుంది. బ్యాటర్లు, బౌలర్లను బ్యాలెన్స్ చేసింది. ప్రస్తుతం ఆ జట్టులో 11 మంది ప్లేయర్లు ఉన్నారు. ఇంకా 14 మందిని తీసుకోవాల్సి ఉంది. 9 కోట్ల 25 లక్షల రూపాయలు ఆ జట్టు అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉంది.

హాట్ టాపిక్..
రిటైన్ చేసుకున్న విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌తో పాటు కొత్తగా ఎనిమిది మంది ప్లేయర్లు రాయల్ ఛాలెంజర్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ, హర్షల్ పటేల్‌ను తొలిరోజే కొనుగోలు చేసింది. వీరిద్దరూ ఇదివరకు ఆ జట్టుతో ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్‌ను కొత్తగా టీమ్‌లో చోటు కల్పించింది. ఈ సెలెక్షన్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

కేప్టెన్సీ కోసమే?
డుప్లెసిస్‌ను టీమ్‌లో తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. విరాట్ కోహ్లీ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ- అనుభవజ్ఞుడైన డుప్లెసిస్‌ను భారీ రేటు పెట్టి కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. ఐపీఎల్, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉన్న డుప్లెసిస్‌కు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించడానికే అతణ్ని జట్టులోకి తీసుకుందరు అభిప్రాయాలు ఉన్నాయి.

వైస్ కేప్టెన్‌గా డీకే..
వంద ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు ఫాప్. 2012 నుంచీ చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగాడు. ఆ జర్నీకి ఇప్పుడు బ్రేక్ పడింది. రాయల్ ఛాలెంజర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బౌలర్ హర్షల్ పటేల్ సైతం డుప్లెసిస్ వైపే మొగ్గు చూపాడు. కోల్‌కత నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్‌కు వైస్ కేప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేకపోలేదు. నైట్ రైడర్స్‌కు కేప్టెన్‌గా పని చేసిన అనుభవం డీకేకు ఉంది. 213 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడతను. అందుకే- అతణ్ని వైస్‌గా అపాయింట్ చేయొచ్చు.

స్పెషలిస్ట్, అన్‌క్యాప్డ్..
ఈ ఇద్దరి సారథ్యంలో ఈ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ కొత్తగా ఆరంభించడం దాదాపు ఖరారైనట్టే. రెండోరోజు ఎలాంటి ప్లేయర్లను రాయల్ ఛాలెంజర్స్ తీసుకుంటుందనే విషయంపై అందరి దృష్టీ నిలిచింది. చాలావరకు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ధీటుగా రాణించే సత్తా ఉన్న టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాటర్ల కోసం పోటీ పడొచ్చు. మహ్మద్ సిరాజ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్‌కు తోడుగా మరికొంతమంది స్పెషలిస్ట్ బౌలర్లను తీసుకోవాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications