IPL 2022: ఐపీఎల్ వేదికపై కీలక అప్‌డేట్.. ఆ 3 మైదానాల్లోనే టోర్నీ నిర్వహణ!

కరోనా పుణ్యమా అని గతేడాది ఐపీఎల్ ఇండియాలో పూర్తిగా జరగనే లేదు. ఇక అంతకుముందు ఏడాది అయితే పూర్తి సీజన్‌ను బీసీసీఐ విదేశాల్లోనే నిర్వహించింది. దీంతో ఈ సారైనా భారత్‌లో పూర్తి ఐపీఎల్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తవడం, కరోనా కేసులు కూడా తగ్గడంతో ఈ సారి మెగా లీగ్ ఇండియాలోనే జరగుతుందని అంతా భావించారు. కానీ ఇంతలోనే కరోనా మహమ్మారి మళ్లీ వచ్చేసింది. థర్డ్ వేవ్ పేరుతో ఈ నెల మొదటి నుంచి ఇండియాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది.

ప్రత్యామ్నాయ వేదికలు పరిశీలన
ఈ నేపథ్యంలో ఈ సారి కూడా ఐపీఎల్ ఇండియాలో జరగడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నాయ వేదికలుగా బీసీసీఐ యూఏఈ, శ్రీలంక, దక్షిణాఫ్రికాను పరిశీలిస్తోందని వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఇండియాలోనే పరిమిత వేదికల్లో లీగ్‌ను నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఇవి కాకుండా అసలు మ్యాచ్‌లకు ఈ సారి ప్రేక్షకులను అనుమతించే అవకాశం లేదని మరో వార్త కూడా వచ్చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

3 వేదికల్లో నిర్వహణ
ఈ నేపథ్యంలో అభిమానులకు కాస్త ఊరట కల్గించే వార్త ఒకటి ప్రస్తుతం బయటికి వచ్చింది. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ఐపీఎల్ 15వ ఎడిషన్ ఎక్కడికి తరలి పోవడం లేదు. ఇండియాలోనే జరగనుంది. అయితే వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా ఒకే ప్రాంతంలో ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తోందట. గతంలో వార్తలు వచ్చినట్టుగానే ముంబైలో ఐపీఎల్‌ను నిర్వహించనున్నారట. ముంబైలోని 3 వేదికల్లో లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాలను ఐపీఎల్ వేదికలుగా వాడుకోవాలని బీసీసీఐ నిర్ణయించుకుందట. అవసరమైతే పుణేలోనూ మ్యాచ్‌లు నిర్వహించడానికి సిద్ధంగా ఉందంట.

20న తుది నిర్ణయం
ఇలా ఒకే ప్రాంతంలో మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండదు. దూరపు ప్రాంతాలకు వెళ్లాల్సిన పని కూడా ఉండదు. అలాగే బయోబబుల్ వంటి సమస్యలు కూడా ఉండవు. దీంతో కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ ఫిబ్రవరి 20వ తేదీన తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అయితే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ముంబైలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడమే అని తెలుస్తోంది.

మెగా వేలానికి అంతా సిద్ధం
మరోవైపు బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న జరగనున్న ఐపీఎల్ మెగా వేలానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేలంలో 10 జట్లు పాల్టొననున్నాయి. మొత్తంగా స్వదేశీ, విదేశీ కలుపుకుని 1200 కు పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications