
వయస్సు ఎక్కువ
బ్రావో వయసు 38 సంవత్సరాలు. దీంతో బ్రావో వయసు ఎక్కువనే చెప్పుకొవచ్చు. ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ జాబితాలో బ్రావోకు చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం అతని వయస్సు ఎక్కువగా ఉండడమే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వయసులో బ్రావో టీ20 క్రికెట్‌లో రాణించడం కష్టమని సీఎస్కే మేనేజ్‌మెంట్ భావించి ఉంటుందని అంటున్నారు. అందుకే బ్రావో బదులు యువ ఆటగాళ్లను నమ్ముకోవడం ఉత్తతమమనే ఆలోచనతో తమ రిటెన్షన్ జాబితా నుంచి సీఎస్కే బ్రావోను తొలగించినట్టు సమాచారం.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఐపీఎల్ వంటి లీగ్‌ల్లో ఆడడనున్నాడు. అయితే ఇది కూడా బ్రావోకు మైనస్‌గా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన బ్రావో ఐపీఎల్‌లో రాణిస్తాడని సీఎస్కే మేనేజ్‌మెంట్ అంతగా ఆశించలేదు. అందుకే బ్రావోను తప్పించిందని సమాచారం.

ధర ఎక్కువ
ఐపీఎల్‌లో మొదటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రావోకు ఆ జట్టు డబ్బులు కూడా అదే రేంజ్‌లో ముట్ట చెప్పింది. గత ఏడాది బ్రావోకు సీఎస్కే 6 కోట్ల 40 లక్షల రూపాయలు చెల్లించింది. కానీ ప్రస్తుతం అతని వయస్సు, ఫాం దృష్యా అంత మొత్తంలో ఇవ్వడానికి సీఎస్కే ఇష్టపడలేదని సమాచారం. అందుకే వేలంలోకి వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే పరిస్థితులుఅనుకూలిస్తే వేలంలో మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఫాంలో లేడు
సరైన ఫాంలో లేకపోవడం బ్రావోకు ప్రధాన సమస్యగా మారింది. అంతలో ఆటలో గతంలో పోలిస్తే పస తగ్గింది. గత సీజన్లో బాల్‌తో బాగానే రాణించినప్పకీ బ్యాటర్‌గా బ్రావో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఆల్‌రౌండర్ పాత్రకు బ్రావో సరైన న్యాయం చేయడం లేదనే విమర్శలు కూడా వచ్చాయి. గతేడాది 11 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 14 వికెట్లు తీసినప్పటికీ, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 47 పరుగులే చేశాడు. ఇక 2020లో అయితే 6 మ్యాచ్‌ల్లో కేవలం 7 పరుగులే చేశాడు. 6 వికెట్లు తీశాడు. దీంతో బ్రావోను సీఎస్కే మేనేజ్‌మెంట్ అన్ని మ్యాచ్‌ల్లో ఆడించలేదు. అనేక మ్యాచ్‌ల్లో పక్కనపెట్టింది.

బ్రావో రికార్డులు
తన కెరీర్‌లో ఐపీఎల్‌లో 151 మ్యాచ్‌లు ఆడిన డ్వేన్ బ్రావో 22 సగటుతో 1537 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 70 పరుగులు. ఇక బౌలింగ్‌లో 167 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/22. ఐపీఎల్‌లో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు బ్రావో పేరు మీదనే ఉంది. 2013లో బ్రావో 32 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications
