MS Dhoni: ఒకే దెబ్బకు రెండు పిట్టలు: సీఎస్‌కే కేప్టెన్సీ మార్పు వెనుక ఏం జరిగింది?

ముంబై: ఐపీఎల్ 2022 మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ మార్పు హాట్ టాపిక్‌గా మారింది. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. చెన్నై ఫ్రాంఛైజీ జట్టు కేప్టెన్‌గా రవీంద్ర జడేజాను అపాయింట్ చేయడం ఎంత సంచలనం రేపిందో.. ఇప్పుడూ అదే స్థాయిలో కలకలం సృష్టించింది. టోర్నమెంట్ మధ్యలో కేప్టెన్సీ మార్పు అనేది చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎప్పుడూ చోటు చేసుకోలేదు.

షాడో కేప్టెన్‌గా..
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇబ్బందులకు గురి చేశాయి. విమర్శలకు తెర తీశాయి. కెప్టెన్ రవీంద్ర జడేజా అన్ని విధాలుగా విఫలం అయ్యాడు. తన సొంత ఫామ్‌ను కూడా అతను కోల్పోయాడు. జట్టుకు విజయాలను అందివ్వలేకపోయాడు. చాలా సందర్భాల్లో మహేంద్ర సింగ్ ధోనీ- కేప్టెన్‌గా వ్యవహరించాడు. ఫీల్డింగ్‌ను సెట్ చేస్తూ కనిపించాడు. ఈ పరిణామాల మధ్య రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.


జట్టు ప్రయోజనాల కోసం..
కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పుకొని, దాన్ని ధోనీకి అప్పజెప్పాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ట్విటర్ వేదికగా ఓ ప్రకటనలో పేర్కొంది. ధోనీకి కేప్టెన్సీని అప్పగించాలనుకోవడం సమష్టి నిర్ణయమని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. జట్టు ప్రయోజనాల కోసం ధోనీ తన పరిధిని దాటి మరీ బాధ్యతలను అందుకోవడానికి ముందుకొచ్చాడని చెప్పుకొచ్చారు. రవీంద్ర జడేజా తన సొంత ఫామ్‌ను మెరుగుపర్చుకోవడానికి కేప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు స్పష్టం చేశారు.

మరిన్ని అపజయాలను నివారించడానికే..
కాగా- ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పెర్ఫార్మెన్స్ అధ్వాన్నం. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో రెండింట్లో మాత్రమే నెగ్గింది ఈ సెకెండ్ మోస్ట్ ఐపీఎల్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నవి నాలుగు పాయింట్లే. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇంకా ఆరు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ సాయంత్రం పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంది.

టఫ్ మ్యాచ్‌లే..
అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉంది. ఇవన్నీ టఫ్ మ్యాచ్‌లే. ఆయా జట్లన్నీ బలమైనవే. వాటిపై గెలవాలంటే- అనుభవజ్ఞుడైన ప్లేయర్‌ను కేప్టెన్‌గా నియమించాల్సి ఉంటుందని ఫ్రాంఛైజీ భావించింది. దాన్ని అమలు చేసింది. కేప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడం వల్ల అటు రవీంద్ర జడేజా వ్యక్తిగత ప్రదర్శన కూడా మెరుగుపడుతుందని అంచనా వేస్తోంది.

రవీంద్ర జడేజా రాణిస్తాడనే విశ్వాసం..
ఇదివరకు కేప్టెన్సీ పగ్గాలను అందుకున్న అనుభవం రవీంద్ర జడేజాకు లేదు. ఒకేసారి ఐపీఎల్ వంటి ఫార్మట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కేప్టెన్‌గా వ్యవహరించాల్సి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. తన సొంత ఫామ్‌ను కూడా కోల్పోయాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గా రాణించలేకపోయాడు. ఒకట్రెండు కీలక క్యాచ్‌లను సైతం జారవిడిచిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు కేప్టెన్సీ పగ్గాలను వదులుకోవడం వల్ల రవీంద్ర జడేజా మునుపటి ఫామ్‌లోకి వస్తాడని నమ్ముతోంది ఫ్రాంఛైజీ. ధోనీ కేప్టెన్సీ.. జడేజా ఫామ్‌లోకి వస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టవుతుందని అభిప్రాయపడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications