Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో విండీస్ ఆల్‌రౌండర్: చెన్నై సూపర్ కింగ్స్‌ లెథల్ వెపన్

IPL 2022: West Indies all rounder Dwayne Bravo Confirms that he will participate in mega auction

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022..15వ ఎడిషన్ సరికొత్తగా కనిపించబోతోంది. అన్ని ఫ్రాంఛైజీల్లోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఫ్రాంఛైజీలన్నీ తమ తురుపుముక్కలను వదలుకున్నాయి. వచ్చే సంవత్సరం మార్చి చివరివారంలో మొదలయ్యే ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్రతి జట్టులోనూ కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. రెండు కొత్త ఫ్రాంఛైజీలు వచ్చి చేరడంతో మార్పులు అనివార్యమైంది. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ లక్నో, సీవీసీ కేపిటల్స్ గ్రూప్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను నెలకొల్పాయి.

 రిటెన్షన్ పాలసీతో..

రిటెన్షన్ పాలసీతో..

కొత్త రిటెన్షన్ పాలసీ వల్ల మ్యాచ్‌లను గెలిపించిన వీరులందరూ తమ ఫ్రాంఛైజీల నుంచి బయటికొచ్చారు. వచ్చే ఏడాది నిర్వహించే మెగా వేలంపాటలో పాల్గొననున్నారు. ఈ ఐపీఎల్ స్టార్లల్లో డ్వేన్ బ్రావో కూడా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్ ఆల్‌రౌండర్ అతను. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఈ జట్టు ఈ సారి అతన్ని వదలుకుంది. రిటెన్షన్ చేసుకోలేదు. కేప్టెన్ ధోని, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీలను మాత్రమే రిటైన్ చేసుకుంది. మిగిలిన వారందరినీ వదులుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్‌తో..

చెన్నై సూపర్ కింగ్స్‌తో..

దీనితో చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘకాలం పాటు అసోసియేట్‌ అయిన డ్వేన్ బ్రావో బయటికొచ్చాడు. మెగా ఆక్షన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సీఎస్‌కే అతన్ని వదులుకోవడంతో 38 సంవత్సరాల డ్వేన్ బ్రావో ఐపీఎల్ కేరీర్ ముగిసినట్టేనని అందరూ భావించారు. మెగా ఆక్షన్‌లో పాల్గొనకపోవచ్చని, స్వదేశంలో జరిగే కరేబియన్ సూపర్ లీగ్స్ టోర్నమెంట్లు, జాతీయ జట్టుకే అతను పరిమితం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

డ్వేన్ బ్రావో రెడీ..

డ్వేన్ బ్రావో రెడీ..

ఆ అనుమానాలను డ్వేన్ బ్రావో పటాపంచలు చేశాడు. ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో పాల్గొనబోతోన్నట్లు స్పష్టం చేశాడు. ఈ మెగా వేలంపాట కోసం తాను 100 శాతం అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ తనను రిటైన్ చేసుకోలేదని, అలాగని తాను ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు దూరం అయినట్టు కాదని పేర్కొన్నాడు. ఈ సారి తనను ఏ ఫ్రాంఛైజీ తీసుకుంటుందో తెలియదని, చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించాడు.

ధోనీతో అనుబంధం..

ధోనీతో అనుబంధం..

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కేప్టెన్ ధోనీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు డ్వేన్ బ్రావో. ధోనీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాడు. క్రికెట్‌కు ధోనీ గ్లోబల్ అంబాసిడర్ లాంటి వాడని ప్రశంసించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌‌ను అత్యుత్తమంగా నిలబెట్టిన ఘనత ధోనికి దక్కుతుందని, అతని సారథ్యంలో తాను ఆ జట్టు ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతానని చెప్పాడు. అలాంటి అవకాశాన్ని ధోనీ తనకు ఇచ్చాడని, తన కేరీర్ మరింత మెరుగుపడటానికి దోహదపడిందని పేర్కొన్నాడు.

ఒలింపిక్స్‌లో టీ10 ఫార్మట్

ఒలింపిక్స్‌లో టీ10 ఫార్మట్

మరోసారి తాను చెన్నై సూపర్ కింగ్స్‌తో అసోసియేట్ అవుతానో..లేదో తనకు తెలియదని అన్నాడు. ఏ ఫ్రాంఛైజీ తనను తీసుకుంటుందో కూడా తాను అంచనా వేయలేకపోతున్నానని చెప్పాడు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని డ్వేన్ బ్రావో అన్నాడు. టీ10 ఫార్మట్‌ దీనికి అనుకూలంగా ఉంటుందని చెప్పాడు.

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడాలని ప్రతి ఆటగాడు బలంగా కోరుకంటున్నాడని, అది త్వరలోనే సాకారం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దీనికి మరింత ప్రోత్సాహాన్ని అందించినట్టవుతుందని, మరిన్ని దేశాలు ఈ గేమ్ వైపు మొగ్గు చూపుతారని డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, December 8, 2021, 15:20 [IST]
Other articles published on Dec 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+