
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. ఉదయం ఒక్క ఆటగాడిని కూడా కొనుగోలు చేయని సన్‌రైజర్స్ మధ్యాహ్నం ఆరంభంలోనే టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. కోటి 50 లక్షల రూపాయల కనీస ధరతో మెగా వేలం బరిలోకి దిగిన సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 కోట్ల 75 లక్షల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. సుందర్ వేలంలోకి రాగానే అతని కోసం మొదటగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. వాషింగ్టన్ సుందర్ వేలం 7 కోట్ల 75 లక్షల రూపాయల దగ్గర ఉన్నప్పటి నుంచి సన్‌రైజర్స్, లక్నో పోటా పోటీగా తలపడ్డాయి. అయితే చివరకు వాషింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాదే కొనుగోలు చేసింది.
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తోపాటు బాల్‌తోనూ రాణించగలడు. ఈ విషయంలో సుందర్ ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టులో సుందర్ రాణిస్తున్నాడు. తాజాగా మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. అందుకే వేలంలో భారీ ధర వెచ్చించి సుందర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. కాగా గత సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సుందర్‌కు ఆ జట్టు 3 కోట్ల 20 లక్షల రూపాయలు చెల్లించింది. ఈ సారి ఆ ధర ఏకంగా రెండింతలకు పైగా అయింది. గత సీజన్ కంటే 5 కోట్ల 55 లక్షల రూపాయలు ఎక్కువగా చెల్లించి మెగా వేలంలో వాష్టింగ్టన్ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదారాబాద్ కొనుగోలు చేసింది.